పీరియడ్స్ క్రమం తప్పాయా..? వీటితో పరిష్కారం

First Published Dec 18, 2019, 4:21 PM IST

బరువు విపరీతంగా పెరిగినా, తగ్గినా కూడా నెలసరి ఆలస్యం కావొచ్చు. చదువుల ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు.. ఇలా కారణం ఏదైనా ఒత్తిడి కూడా కారణం కావొచ్చు. దాని ప్రభావంతో అమ్మాయిల్లో నెలసరి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది

నెలసరి ప్రతి నెలా వచ్చేస్తుంది. వచ్చిన ప్రతిసారి ఎంత ఇబ్బంది పెట్టినా...  సమయానికి రాకపోతే మాత్రం కంగారుపడిపోతుంటాం. కంగారు పడాలి కూడా అంటున్నారు నిపుణులు. సాధారణంగా నెలసరి 28 నుంచి 30 రోజుల్లోపు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులు అటుఇటుగా వస్తుంది.
undefined
దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ... అలా కాకుండా 40 రోజులు దాటినా రాకుండా ఉండటం... లేదంటే మూడు వారాలకన్నా ముందే రావడం జరుగుతుంది. అలాంటి వాళ్లు మాత్రం కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సమయానికి రాకపోవడానికి ఒక కారణం కావొచ్చు. అలా కాకుంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండే అవాకశం ఉంది. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపాలతో పాటు మరిన్ని ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు.
undefined
బరువు విపరీతంగా పెరిగినా, తగ్గినా కూడా నెలసరి ఆలస్యం కావొచ్చు. చదువుల ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు.. ఇలా కారణం ఏదైనా ఒత్తిడి కూడా కారణం కావొచ్చు. దాని ప్రభావంతో అమ్మాయిల్లో నెలసరి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకుండా... విపరీతంగా డైట్ ఫాలో అయ్యేవారిలో కూడా ఈ సమస్య తలెత్తుంది.
undefined
థైరాయిడ్ లోపాలు, ఎడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా నెలసరి క్రమం తప్పుతుంది. క్రోమోజోముల లోపాలు ఉన్న స్త్రీలకు అండాల నిల్వ ఉండదు. ఒక్కోసారి అండాశయాలు కూడా తయారు కావు. గర్భాశయం చిన్నగా ఉన్నవారికి కూడా నెలసరి సరిగా రాదు. కాబట్టి  సమస్య  ఏంటో తెలుసుకోని వైద్యులతో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
undefined
నెలసరి క్రమం తప్పకుండా రావాలి అంటే... బరువు మరీ పెరగకుండా.. మరీ తగ్గకుండా చూసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. సమస్య పెద్దది కానప్పుడు కొన్ని నెలలపాటు హార్మోన్లను క్రమబద్ధీకరించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడితో సరిపోతుంది.
undefined
ఇవన్నీ కాకుండా కొన్ని వంటింటి చిట్కాలతో కూడా ఈ పీరియడ్ సమస్యను క్రమబద్ధీకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అల్లం తో పీరియడ్స్ క్రమబద్ధీకరణను పరిష్కరించవచ్చు.
undefined
అల్లంలో ఎన్నో గొప్ప ఔషదాలు ఉన్నాయి. వాటితో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు. ఓ కప్పు నీటిలో తాజా అల్లం ముక్కని వేసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత దీనిని వడకట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాసింత తేనెని కలపండి. దీనిని ప్రతీ రోజూ భోనం చేసిన తర్వాత తాగండి. దీని వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌‌గా తయారవుతాయి.
undefined
దాల్చిన చెక్క... దీనిలో కూడా ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలోనూ ఈ మసాలా దినుసు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి రుతు క్రమ సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం దాల్చిన చెక్కని చక్కగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని గోరువెచ్చని పాల్లలో కలిపి తాగాలి. అదే విధంగా.. మీరు తీసుకునే ప్రతీ ఆహారంపైనా ఈ పొడిని చల్లుకుని తీసుకోవచ్చు. దీని వల్ల పీరియడ్స్ కచ్చితంగా రెగ్యులర్ అవుతాయి.
undefined
పండ్లు ఎక్కువగా తీసుుకోవడం.. లేదంటూ జ్యూస్ లు తాగడం వల్ల కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. యోగా, మెడిటేషన్, చిన్న పాటి నడక లాంటివి కూడా ఇందుకు ఎంతగానో సహకరిస్తాయి.
undefined
click me!