అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ జెల్ జుట్టును అందంగా మారుస్తుందట. అవిసె గింజలు మెగ్నీషియం, బి విటమిన్లు, మాంగనీస్, కాపర్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు , సెలీనియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. కాబట్టి... ఇవి జుట్టు , స్కాల్ప్ రెండింటికీ మేలు చేస్తాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలను పెంపొందిస్తాయి. జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. అవిసె గింజల వాడకం జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.