తలస్నానం రోజూ చేయాలా..? వారినికి ఒకసారి చేస్తే సరిపోదా..?

First Published | Mar 28, 2024, 11:28 AM IST

వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి..? నిజంగా వారానికి ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Washing

ఈ ఉరుకుల పరుగల జీవితంలో చాలా మందికి కనీసం తినే టైమే ఉండటం లేదు. అలాంటిది తీరికగా తలస్నానం చేయడం కూడానా.. ఆదివారం ఇంట్లో ఉన్నప్పుడు చేయడమే గగనం అవుతోంది అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ.. బయట దుమ్ము, దూళిల మధ్య రెగ్యులర్ గా తలస్నానం చేయకపోతే.. ఉన్న కాస్త జుట్టు కూడా ఊడిపోతుందనే భయం ఉంటుంది.
 

అసలు జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే.. వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి..? నిజంగా వారానికి ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Latest Videos


మన అందరిదీ ఒకేరకమైన హెయిర్ ఉండదు. కొందరికి డ్రై స్కాల్ప్ ఉంటుంది... మరి కొందరిది ఆయిల్ స్కాల్ప్ ఉంటుంది. అలా ఆయిల్ తలతో ఉండేవారు.. దాని ప్రభావం తమ ముఖంపై కూడా పడుతుందని.. రెగ్యులర్ గా అవసరం అయితే.. ప్రతిరోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల  దుమ్ము, దూలితోపాటు తలలోని ఆయిల్ మొత్తం తొలగిపోతోంది. దాని వల్ల వారి జుట్టు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటుంది.

shampoo

అంతేకాదు.. ప్రతిరోజూ వ్యాయామం, జిమ్ కి వెళ్లి కసరత్తులు చేసేవారికి ఎక్కువగా చెమట పట్టేస్తూ ఉంటుంది. ఆ చెమటను కనుక తొలగించకపోతే...హెయిర్ ఫాల్ పెరిగిపోతుంది. అలాంటివారు.. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తూ ఉండటమే మంచిది. వాళ్లకు అది అవసరం కూడా . అలా చేయకపోతే వారికి జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. చుండ్రు కూడా పెరుగుతుంది. అందుకే వారు రోజూ తలస్నానం చేయడం మంచిది.
 

shampoo

అయితే అలా అని... రోజూ హెయిర్ వాష్ చేయడం కూడా అంత మంచిదేమీ కాదు. ఎందుకంటే.. ఈ రోజుల్లో షాంపూలన్నీ కెమికల్స్ తో తయారు అవుతున్నవే. కాబట్టి...  జుట్టుని తొందరగా పాడయ్యేలా చేస్తాయి. అంతేకాదు.. రోజూ తలస్నానం చేయడం వల్ల.. మన జుట్టులో ఉండే సహజ ఆయిల్స్ అన్నీ పోతాయి. దాని వల్ల జుట్టు మరీ పొడిగా మారిపోతాయి. జుట్టు మెరవడం తగ్గిపోయి..నిర్జీవంగా మారిపోతుంది.

chemical free shampoo

అందుకే.. మరీ రోజూ హెయిర్ వాష్ చేయడం.. అలా అని వారానికి ఒకసారి చేయడం లాంటివి చేయకూడదు. వారానికి రెండుసార్లు చేయడం ఉత్తమం. అయితే... మనం ఎంచుకునే షాంపూల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెమికల్స్ ఎక్కువగా లేని షాంపూలను ఎంచుకోవాలి.  నేచురల్ వి ఎంచుకోవడం వల్ల..జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

click me!