ప్రతి అమ్మాయి దగ్గర కచ్చితంగా ఉండాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవి..!

First Published | Feb 3, 2024, 11:38 AM IST

హ్యాండ్ బ్యాగ్ తో ఎలాంటి లుక్ అయినా పూర్తిగా మారిపోతుంది. చాలా ట్రెండీ గా, స్టైలిష్ గా కనపడటానికి సహాయపడుతుంది. అయితే.. మహిళల దగ్గర కచ్చితంగా ఉండాల్సిన హ్యాండ్ బ్యాగులు ఏంటో ఓసారి చూద్దాం...
 

hand bag


అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరి దగ్గర కనీసం నాలుగైదు ఉంటూ ఉంటాయి. వారు వెళ్లే ప్లేస్ ని బట్టి.. తమ డ్రెస్ ని బట్టి.. బ్యాగులు మారుస్తూ ఉంటారు. హ్యాండ్ బ్యాగ్ తో ఎలాంటి లుక్ అయినా పూర్తిగా మారిపోతుంది. చాలా ట్రెండీ గా, స్టైలిష్ గా కనపడటానికి సహాయపడుతుంది. అయితే.. మహిళల దగ్గర కచ్చితంగా ఉండాల్సిన హ్యాండ్ బ్యాగులు ఏంటో ఓసారి చూద్దాం...


1.టోట్ బ్యాగులు

టోట్ బ్యాగ్‌లు ఏ స్త్రీల వార్డ్‌రోబ్‌లు కచ్చితంగా ఉండాల్సిందే. ఇవి విశాలంగా , ఆచరణాత్మకంగా ఉంటాయి. మీ దుస్తులకు అధునాతనతను,  సౌకర్యాన్ని అందించడంలో మీకు సహాయపడతాయి. చాలా విశాలంగా  ఉంటాయి. ఎక్కడికి తీసుకువెళ్లడానికైనా సౌకర్యంగా ఉంటుంది. మీకు నచ్చిన రంగుల్లో లభిస్తుంది.  ఇది మీ లుక్ ని కంప్లీట్ చేస్తుంది. 



2. క్రాస్‌బాడీ బ్యాగ్‌లు


క్రాస్‌బాడీ బ్యాగ్‌లు మీ స్టైల్‌పై రాజీ పడకుండా మీ చేతులను ఫ్రీగా ఉంచుతాయి. దగ్గర దగ్గర ప్లేసులు వెళ్లడానికి దీనిని వాడొచ్చు. ఇది మీ రోజువారీ పనులను అమలు చేయడానికి అనువైనది. నగరాన్ని అన్వేషించడానికి ఇది సరైన ఎంపిక, ఎందుకంటే ఇది మీ చిన్న చిన్న వస్తువులను ఉంచడానికి, అదే సమయంలో మీ చేతులను ఫ్రీ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.
 

Image: Getty


3. వర్క్ బ్యాగ్..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆఫీసుకు వెళ్లేవారే. అయితే.. ఆఫీసుకు వెళ్లేందుకు స్పెషల్ గా ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంచుకోవాలి.  అది చూడగానే.. కేవలం పనికి మాత్రమే ఉపయోగించేలా ఉండాలి.  ఆ బ్యాగ్‌లో మీ డాక్యుమెంట్‌లు, పెన్నులు, మేకప్ ఉపకరణాలు, వాటర్ బాటిల్ , ల్యాప్‌టాప్ కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఉండాలి.
 

4. స్టేట్‌మెంట్ బ్యాగ్స్..

మీ వార్డ్‌రోబ్‌లో స్టేట్‌మెంట్ హ్యాండ్‌బ్యాగ్ కచ్చితగా  ఉండాలి, అది మీ చుట్టూ ఉన్న అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీ వ్యక్తిత్వం , దుస్తులకు కూడా సరిపోలాలి. మీరు ప్రత్యేకమైన నమూనాతో బోల్డ్ లేదా న్యూట్రల్ కలర్‌ని ఎంచుకోవచ్చు, ఎలాంటి డ్రెస్ ల మీద అయినా స్పెషల్ గా కనిపించేలా చేయడంలో ఈ స్టేట్మెంట్స్ బ్యాగ్స్  సూపర్ గా ఉంటాయి.
 

handbag guns

5.క్లచ్..
చివరగా క్లచ్. దీనిని హ్యాండ్ బ్యాగ్ అని చెప్పలేం.. వ్యాలెట్ లాగా చేతితో హ్యాండిల్ చేస్తారు కాబట్టి.. క్లచ్ అని పిలుస్తారు. వీటిని క్లాత్, లెదర్ కాకుండా.. మెటల్ తో తయారు చేస్తారు. ఇవి అయితే.. ఎలిగెంట్ లుక్ ని ఇస్తాయి. పార్టీలకు ఇవి కరెక్ట్ గా సూటౌతాయి.

Latest Videos

click me!