hibiscus
మందార పువ్వులు చూడటానికి అందంగా ఉంటాయి. అందుకే ఇవి ప్రతి ఇంటిముందు కనిపిస్తాయి. నిజానికి ఈ పువ్వులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు జుట్టుకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ,ఇవి ముఖ అందాన్ని పెంచడానికి కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటాయట. మరి ఆ సౌందర్య ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం...
1. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది
మందారలో సున్నితమైన ఆమ్లాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. మన చర్మం అందంగా మెరవడానికి సహాయం చేస్తాయి. సెల్ టర్నోవర్‌ను పెంచుతాయి, ఇది మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది.
hibiscus flower
2. సహజ మాయిశ్చరైజర్
మందార మొక్కల రేకులు, ఆకులు అధిక మొత్తంలో శ్లేష్మం కలిగి ఉంటాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి మొక్కను చాలా ప్రభావవంతంగా చేస్తుంది. మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి మీరు మందార పువ్వు పేస్ట్‌ను మీ చర్మానికి అప్లై చేయవచ్చు.
hibiscus flower
3. వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది
మందారంలో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మొక్క యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మందారలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. అందువల్ల, మందారను ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని బిగుతుగా మార్చవచ్చు. మీరు యవ్వనంగా కనిపించవచ్చు.
Hibiscus flower
4. స్కిన్ టోన్‌ని సమం చేస్తుంది
మందారలో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఉన్నట్లు కనుగొనబడింది. ఇవి మీ శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి మీరు డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ , ట్యాన్ తొలగించుకోవడానికి దీనిని ఉపయోగించవ్చు.
hibiscus flower
5. వాపును తగ్గిస్తుంది
మందారలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల, మందార ఎర్రబడిన చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. స్కిన్ రెడ్ నెస్ ని, దురదను తగ్గిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.