వయాగ్రా తీసుకున్నాక.. సెక్స్ వద్దందని... 80యేళ్ల వృద్ధుడు చేసిన పని...

First Published | Dec 30, 2021, 9:21 AM IST

ఇటలీకి చెందిన  విటో కంగిని (80) తన భార్య  nataliya కైరో చోక్ (61)తో ఇటీవల క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ సమయంలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ.. ఆయనకు సెక్స్ మీదికి మనసు పోయింది. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె కూడా దానికి సరే అనడంతో విటో ఆనంద పడిపోయాడు. 80 ఏళ్ల వయసులో తన కోరికను తీర్చుకోవడానికి.. శృంగార సామర్థ్యం పెంచే వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. మానసికంగా శారీరకంగా సిద్ధమై భార్య కోసం ఎదురు చూశాడు.

ఇటలీ : వృద్ధాప్యంలోనూ Erotic desires ఉంటాయనడానికి..  italyలో జరిగిన ఒక ఘటనే తాజా ఉదాహరణగా నిలిచింది. ఓ ఎనభై యేళ్ల వృద్ధుడు Viagra వేసుకున్నాక తనతో శృంగారానికి ఒప్పుకోలేదని తన భార్యను murder చేశాడు. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ఆమె సరే అంది. దీంతో తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆ తరువాత బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చి అతడికి షాక్ ఇచ్చింది. తనకిప్పుడు శృంగారం వద్దని, మరోసారి ఎప్పుడైనా చూద్దామని చెప్పి పడుకుంది.  అంతే, కోపంతో రగిలిపోయిన ఆ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు…

ఇటలీకి చెందిన  విటో కంగిని (80) తన భార్య  nataliya కైరో చోక్ (61)తో ఇటీవల క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ సమయంలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ.. ఆయనకు సెక్స్ మీదికి మనసు పోయింది. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె కూడా దానికి సరే అనడంతో విటో ఆనంద పడిపోయాడు. 80 ఏళ్ల వయసులో తన కోరికను తీర్చుకోవడానికి.. శృంగార సామర్థ్యం పెంచే వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. మానసికంగా శారీరకంగా సిద్ధమై భార్య కోసం ఎదురు చూశాడు.

భార్య బెడ్ రూమ్ లోకి రాగానే కౌగిలించుకున్నాడు. అయితే, ఆమె అతడిని పక్కకు నెట్టింది. ఇప్పుడు కాదు.. తర్వాత.. అని చెప్పి పడుకుంది. ఆ సమయంలో ముందే మాత్రలు వేసుకుని వేడి మీద ఉన్న విటోకి భార్య తీరుతో పట్టరాని కోపం వచ్చింది. ఆవేశంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని భార్యను పొడిచేశాడు. హత్య చేసిన తర్వాత భార్యను చంపిన భార్య అతడిని వెంటాడింది. రెండు రోజుల తర్వాత తన భార్యను తానే హత్య చేసినట్టు తన మిత్రులకు చెప్పాడు. ఈ సమాచారం పోలీసులకు అందించాలని వారిని కోరాడు. కానీ  పోలీసులు అతని వద్దకు రాలేదు.

మనశ్శాంతి లేక విటో.. తన భార్య చెఫ్ గా రెండేళ్ల పాటు పనిచేసిన రెస్టారెంట్  ఓనర్ కి కాల్ చేశాడు.  తన భార్య ఇక ఎప్పటికీ కనిపించదని అతడితో చెప్పాడు. అతని మాటలతో రెస్టారెంట్ ఓనర్ కి అనుమానం వచ్చింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా అక్కడ రక్తం మడుగులో పడి ఉన్న భార్య కనిపించింది. వెంటనే మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా విటోని ప్రశ్నించారు.

అప్పుడు విటో వయాగ్రా విషయం చెప్పేసరికి పోలీసులు ఆశ్చర్యపోయారు. తన భార్యను చంపినందుకు కొంచెం బాధగా ఉందని.. అందుకే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. 

Latest Videos

click me!