మండపంపై వధువు రాసలీల వీడియో ప్లే చేసిన వరుడు.. వైరల్

First Published | Jan 3, 2020, 2:30 PM IST

తమ ప్రేమ ఎలా మొదలైందో మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అని చెప్పి.. మండపం పక్కన ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ పై ఓ వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో చూసి అందరూ షాకయ్యారు. 
 

వారిద్దరూ ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఇరువైపులా పెద్దలను కూడా ఒప్పించారు. వారు కూడా వీరి పెళ్లికి అంగీకారం తెలిపారు. ముహుర్తాలు పెట్టుకున్నారు.. బంధువులను పిలుచుకున్నారు.
ఆ ప్రేమ జంట ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అందంగా ముస్తాబై పెళ్లి మండపం ఎక్కారు. బంధువులంతా వారికి ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. పెళ్లి ముహుర్తానికి ఇంకాస్త సమయం ఉండటంతో... బందువులకు, తన ప్రేయసికి వరుడు.. ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

తమ ప్రేమ ఎలా మొదలైందో మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను అని చెప్పి.. మండపం పక్కన ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ పై ఓ వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో చూసి అందరూ షాకయ్యారు.
అసలు ఆ వీడియోలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా... వధువు.. రాసలీలలు. అది ప్రేమించి.. మరి కాసేపట్లో పెళ్లి చేసుకోబోయే వరుడుతో కాకపోవడం గమనార్హం.
మరి.. ఆ వీడియోలో వధువుతో శృంగారంలో పాల్గొంది ఇంకెవరో కాదు.. వరుడి స్వయానా బావ. అంటే తన సోదరి భర్త. అంతే ఆ వీడియో చూసి... పెళ్లికి వచ్చిన వారంతా షాకయ్యారు.
వధువుకి విషయం అర్థమైపోయి... అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఆ వీడియో దాదాపు ఐదు నిమిషాలపాటు సాగటం గమనార్హం. ఈ సంఘటన చైనాలో ని ఫుజియాన్ సిటీలో చోటుచేసుకుంది.
అసలు మ్యాటరేంటంటే...వీళ్లిద్దరూ సిన్సియర్ గానే ప్రేమించుకున్నారు. దాదాపు పెళ్లి కూడా ఖరారు అయ్యింది. ఆ సమయంలో వరుడు చెల్లెలి భర్త... ఈ యువతికి పరిచయం అయ్యాడు.
అతని భార్య గర్భిణి కావడంతో కాబోయే పెళ్లికూతురికి దగ్గరయ్యాడని చెబుతున్నారు. మొత్తానికి ఇద్దరిమధ్యా పరిచయం ముదిరి పడకగదికి దారితీసింది. విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు కోపంతో రగిలిపోయిన వారి పడక పర్వాన్ని రహస్యంగా చిత్రీకరించాడు.
మనసులో పగను దాచిపెట్టి, పెళ్లిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే... ఇది నిజంగా జరిగిందో లేదో క్లారిటీ లేదు. ఎందుకంటే.. కనీసం వాళ్ల పేర్లు కూడా తెలియడం లేదు. ఎవరో కావాలని సరదాగా ప్రాంక్ వీడియో తీసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Latest Videos

click me!