అగోండా బీచ్, గోవా
గోవా అంటేనే రకరకాల బీచ్ లకు, అందమైన తీరప్రాంత దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. మీరు బంగారు ఇసుక, ప్రశాంతమైన అలల మధ్య రిలాక్స్ అవ్వాలనుకుంటే అగోండా బీచ్ ను సందర్శించండి. దక్షణ గోవాలో ఉన్న ఈ ప్రశాంతమైన బీచ్ పనాజీ నుండి 15 నిమిషాల ప్రయాణం చేస్తే వచ్చేస్తుంది.
రాధానగర్ బీచ్, హేవ్‌లాక్ ద్వీపం, అండమాన్
అండమాన్ దీవుల్లో ఉన్న రాధానగర్ బీచ్ దాని స్వచ్ఛమైన నీరు, మెరిసే తెల్లని ఇసుకకు ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన వాతావరణం, చక్కని సహజ సౌందర్యం కలగలిసిన ప్రదేశం ఇది. ప్రశాంతత కోరుకునే పర్యాటకులు ఇక్కడ రిలాక్స్ కావొచ్చు.
అంజునా బీచ్, గోవా
మీరు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే అంజునా బీచ్ కి వచ్చేయండి. ఉత్తర గోవాలోని అందమైన గ్రామంలో ఉన్న ఈ బీచ్ లో రంగురంగుల వాతావరణం మధ్య పార్టీలు జరుగుతుంటాయి. మీరు రాత్రంతా డ్యాన్స్ చేయాలనుకుంటే అంజునా బీచ్ మీకు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది.
కోవలం బీచ్, కేరళ
దక్షిణ భారతదేశపు స్వర్గం అని పిలువబడే కోవలం బీచ్ స్వచ్ఛమైన నీరు, మెత్తటి తెల్లని ఇసుక, కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంటుంది. ఈ అందమైన బీచ్ లో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. నీటిలో సాహసవంతమైన వాటర్ స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు.
నీల్ ద్వీపం, అండమాన్, నికోబార్
అండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న నీల్ ద్వీపాన్ని విదేశీ పర్యాటకులు ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీటితో ఈ బీచ్ సహజ సౌందర్యంగా కనిపిస్తుంది. ఇక్కడ అందమైన రోడ్లపై సైక్లింగ్ చేయొచ్చు. పగడపు దిబ్బల నీటిలో స్నార్కెలింగ్ కూడా చేయొచ్చు.
మహాబలిపురం బీచ్, చెన్నై
బంగాళాఖాతం తీరంలో ఉన్న మహాబలిపురం బీచ్ కు అద్భుతమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 7వ శతాబ్దపు ఆలయాలు ఈ బీచ్ లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ప్రాచీన వాస్తుశిల్పం, అందమైన తీరప్రాంత దృశ్యాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
మెరీనా బీచ్, చెన్నై
ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్. దక్షిణ భారతదేశపు అందాలను ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. పొడవైన తీరప్రాంతంతో పాటు మెరీనా బీచ్ అనేక చారిత్రక ప్రదేశాలను కలిగి ఉంది.
కారైకాల్ బీచ్, పాండిచ్చేరి
పాండిచ్చేరిలో ఉన్న కారైకాల్ బీచ్ అరసలార్ నది, బంగాళాఖాతం కలిసే చోటు. అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలనుకుంటే మీరు ఈ ప్రాంతానికి వచ్చేయండి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, అందమైన సహజ సౌందర్యంతో, కారైకాల్ బీచ్ ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది.
రుషికొండ బీచ్, విశాఖపట్నం
రుషికొండ బీచ్ బంగారు ఇసుక, స్వచ్ఛమైన నీటికి ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ కు కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దలు కలిసి సమయాన్ని గడపడానికి సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది.
అరామ్‌బోల్ బీచ్, గోవా
ఉత్తర గోవాలో ఉన్న అరామ్‌బోల్ బీచ్ ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణానికి ఫేమస్. ఇది ప్రశాంతత, నిశ్శబ్దం కోరుకునే వారికి సరైన ప్రదేశం. ఈ బీచ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే సమీపంలోని మంచినీటి సరస్సు ఉండటం. ఈ రెండింటి వల్ల అరామ్‌బోల్ బీచ్ కు ఎక్కువ మంది సందర్శకులు వస్తుంటారు.