రైల్వే జనరల్ టికెట్‌ను రద్దు చేయడం ఎలానో తెలుసా?

First Published | Dec 10, 2024, 8:10 PM IST

సాధారణంగా రిజర్వేషన్ టికెట్లను క్యాన్సిల్ చేయడం గురించి వింటుంటాం. కాని రైల్వేస్ లో జనరల్ టికెట్ ను కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది ఎలా చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 
 

ఇండియాలో రవాణా వ్యవస్థకు రైల్వేస్ చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా గూడ్స్ ద్వారా సరకు రవాణా భారీగా జరుగుతుంటుంది. అందుకే ప్రపంచంలోనే భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది. ప్రతి రోజు మొత్తం 8,702 ట్రైన్స్ ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రతి రోజు సుమారు కోటి యాభై లక్షల మంది రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. రైల్వే డిపార్ట్ మెంట్ రోజురోజుకూ అప్ డేట్ అవుతోంది. 
 

ఇటీవలే వందేభారత్ పేరుతో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ తక్కువ సమయంలో వందల కి.మీ. ప్రయాణించే రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. ఈ ట్రైన్స్ ని ఉపయోగించుకొని లక్షల మంది త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే దూర ప్రయాణాలు చేసే వారు కచ్చితంగా రిజర్వేషన్ తీసుకుంటారు. రిజర్వేషన్ దొరకకపోతే జనరల్ టికెట్లు తీసుకొని సాధారణ బోగీల్లో ప్రయాణిస్తుంటారు.

ఒక్కోసారి రిజర్వేషన్ చేయించుకున్నా టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో  జనరల్ టికెట్లు తీసుకొని జనరల్ బోగీలలో ఎక్కి వెళుతుంటారు. అయితే ఒక్కోసారి జనరల్ టికెట్లు తీసుకున్న తర్వాత రిజర్వేషన్ కన్ఫర్మ్ కూడా అవుతుంటుంది. అదే విధంగా వెళ్లాలనుకున్న చోటకు జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణం మార్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో జనరల్ టికెట్ ను ఎలా రద్దు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 
 


రైల్వే జనరల్ టికెట్‌ను రద్దు చేయడానికి చాలా సింపుల్ విధానాలు కొన్ని ఉన్నాయి. అయితే వీటికి కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. 

మీరు టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే టికెట్ తీసుకున్న తర్వాత 3 గంటల లోపుగా స్టేషన్ మాస్టర్ వద్ద టికెట్‌ను సమర్పించాలి. దీనికి 30 రూపాయల క్లర్కేజ్ ఛార్జీని వసూలు చేస్తారు. 

టికెట్ రద్దు చేయాలంటే ప్రయాణానికి 24 గంటల ముందు టికెట్‌ను స్టేషన్ మాస్టర్ వద్ద సమర్పిస్తే రీఫండ్ పొందవచ్చు.

IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్‌ను రద్దు చేయవచ్చు. రైలు బయలుదేరే ముందు టికెట్‌ను రద్దు చేస్తే రీఫండ్ సులభంగా పొందవచ్చు.

రైలు రద్దయితే e-Tickets పై పూర్తి రీఫండ్ దానికదే క్రెడిట్ అవుతుంది. TDR(టికెట్ డిపాజిట్ రసీదు) తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 

రైలు 3 గంటలకు పైగా లేట్ అయితే మీరు టికెట్‌ను రద్దు చేసి పూర్తి రీఫండ్ పొందవచ్చు.

రైలు దారి మార్చినప్పటికీ కూడా మీరు ప్రయాణం చేయకపోతే, TDR ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు.

ఇప్పుడు రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలోనే కాకుండా UTS యాప్ ద్వారా కూడా జనరల్ టికెట్లు పొందవచ్చు. అదేవిధంగా ప్రయాణించలేకపోతే ఈ యాప్ ద్వారా టికెట్ రద్దు కూడా చేసుకోవచ్చు.

UTS యాప్‌లో టికెట్ రద్దు చేయడం ఎలా? 
ముందుగా లాగిన్ అయ్యి, మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి UTS యాప్ ఓపెన్ చేయండి.
'క్యాన్సిల్' ఆప్షన్ క్లిక్ చేయండి. 
'టికెట్ రద్దు చేయి' క్లిక్ చేయండి. 
తిరిగి చెల్లింపు వివరాలు చూసి 'ok' క్లిక్ చేయండి. మీకు రావాల్సిన టికెట్ డబ్బులు మీ R-వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి. 

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..  రూ.30 కంటే ఎక్కువ విలువైన టికెట్లను మాత్రమే రద్దు చేయవచ్చు.

Latest Videos

click me!