పేరు లేని రైల్వే స్టేషన్.. మరి టికెట్లు ఎలా ఇస్తారో?

Published : Jan 25, 2025, 03:39 PM IST

దేశవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలో ఆ స్టేషన్ పేరు చెప్పి టికెట్ తీసుకుంటారు. అయితే వెళ్లే స్టేషనుకు పేరు లేకపోతే? ఆ స్టేషన్లో ఖాళీ బోర్డు మాత్రమే కనబడితే ఎలా ఉంటుంది? అదెంటీ అనుకుంటున్నారా? నిజమేనండి మన దేశంలో పేరులేని రైల్వేస్టేషన్ ఉంది. అది ఎక్కడుందో.. దానికి ఎందుకు పేరు పెట్టలేదో ఇప్పుడు చూద్దాం.

PREV
14
పేరు లేని రైల్వే స్టేషన్.. మరి టికెట్లు ఎలా ఇస్తారో?

మనదేశంలో రోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. పండుగలు,సెలవు దినాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఎక్కువ దూరం అలసట, ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు కాబట్టి ఎక్కువమంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.

దేశవ్యాప్తంగా 7వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లన్నింటికీ పేర్లు ఉన్నాయి. కానీ ఒక రైల్వే స్టేషన్ మాత్రం పేరు లేకుండానే నడుస్తోంది. రైల్వే స్టేషన్‌కు పేరు లేకుండా ఎలా ఉంటుంది? అని మీరు అనుకోవచ్చు. నిజమే.. ఒక రైల్వే స్టేషన్ పేరు లేకుండానే బిజీగా పనిచేస్తోంది.

24
పేరులేని రైల్వే స్టేషన్

ఈ పేరులేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇది బర్ధమాన్ నగరానికి 35 కి.మీ దూరంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ ను 2008లో నిర్మించారు. అప్పటి నుంచి దీనికి పేరు పెట్టలేదు. ఇప్పటికీ పేరులేని రైల్వే స్టేషన్ అనే పిలుస్తూ ఉంటారు.

పేరు లేకపోయినా ఈ రైల్వే స్టేషన్ బిజీగానే ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 6 రైళ్లు ఆగుతాయి. వాటిలో వేలాది మంది ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్‌కు సరుకు రవాణా కూడా ఉంది.

34
ఎందుకు పేరు పెట్టలేదు?

ఈ రైల్వే స్టేషన్‌కు పేరు పెట్టకపోవడానికి కారణం ఉంది. ఈ రైల్వే స్టేషన్ బంకురా - మసాగ్రామ్ మార్గంలో రైనాగర్, రాయ్‌నగర్ గ్రామాల మధ్య ఉంది. రైల్వే స్టేషన్ నిర్మించిన సమయంలో రెండు గ్రామాల ప్రజలు ఈ స్టేషన్‌కు తమ గ్రామం పేరు పెట్టాలని గొడవ పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఈ రైల్వే స్టేషన్‌కు రాయ్‌నగర్
అని పేరు పెట్టారు.

అక్కడి ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. రైల్వే బోర్డుకు ఫిర్యాదు చేశారు. రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవలు కొనసాగడంతో విషయం కోర్టుకు వెళ్లింది. దీంతో రైల్వే అధికారులు ఈ స్టేషన్‌కు ఏ పేరు పెట్టకుండా ఖాళీగా వదిలేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డులలో ఏ పేరు లేకుండా ఖాళీగా కనిపిస్తుంది.

44
టికెట్లు ఎలా ఇస్తారు?

కోర్టు అనుమతి తర్వాతే పేరు మార్పు గురించి రైల్వే శాఖ ఆలోచించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్ కు పేరు లేకపోవడంతో కొత్త ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. రోజుకు 6 రైళ్లు ఆగినప్పటికీ ఇది ఏ ఊరు అని తెలియక అయోమయానికి గురవుతుంటారు.

పేరులేని ఈ రైల్వే స్టేషన్‌కు ఎలా టికెట్లు ఇస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ప్రస్తుతం ఈ స్టేషన్‌కు టికెట్లు పాత పేరుతోనే అంటే రాయ్‌నగర్ పేరుతోనే ఇస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories