ఆహా! అరకు టూర్‌ని ఇంత తక్కువ బడ్జెట్ లో ఎవరూ ప్లాన్ చేయలేరు

Published : Jan 24, 2025, 07:02 PM IST

మీరు అరకులోని ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా? బొర్రా కేవ్స్, సన్ ఫ్లవర్ గార్డెన్, కాఫీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం, వాటర్ ఫాల్స్ ఇలాంటి  అందమైన ప్రదేశాలను చాలా తక్కువ బడ్జెట్లో చూడాలనుకుంటున్నారా? రెండు రోజులు అరకులో ఉండే విధంగా ప్లాన్ ఇక్కడ ఉంది. వివరాలు చెక్ చేసుకోండి.   

PREV
15
ఆహా! అరకు టూర్‌ని ఇంత తక్కువ బడ్జెట్ లో ఎవరూ ప్లాన్ చేయలేరు

ఇప్పుడు అందరిదీ ఉరకల పరుగుల జీవితమే. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలతో హడావుడి. పెద్దలు ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీ బిజీ. కొన్ని రోజులు ఇవన్నీ వదిలేసి అలా ప్రకృతి ఒడిలో సేద తీరాలని అందరికీ అనిపిస్తుంది. కాని ఎన్నో అడ్డంకులు వాటిల్లో ప్రధాన సమస్య బడ్జెట్. టూర్ ప్లాన్ చేశామంటే అక్కడకు వెళ్లి రావడానికి తక్కువ డబ్బులే అవుతాయి. కాని లోకల్ గా అయ్యే ఖర్చులు మాత్రం రెట్టింపవుతాయి. 

అందుకే తక్కువ బడ్జెట్ లో అరకు ప్రకృతి అందాలను చూసి రావడానికి ఇక్కడ చక్కటి బడ్జెట్ ప్లాన్ సిద్ధంగా ఉంది. 
 

25

మీరు హైదరాబాద్ వాసులైతే అక్కడి నుంచి అరకు వెళ్లి రావడానికి, అరకులో రెండు రోజులు ఉండి చుట్టు పక్కల చూడాల్సిన వాటికి ఎంత ఖర్చవుతుందో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. 

హైదరాబాద్ నుంచి అరకు వెళ్లడానికి ముందుగా వైజాగ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. వైజాగ్ కి హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి. మీరు కొన్ని రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటే వెళ్లడానికి రూ.400, రావడానికి రూ.400 ఖర్చవుతుంది. 
 

35

మొదటి రోజు...
వైజాగ్ నుంచి అరకు వెళ్లడానికి ఉదయం 6.45 గంటలకు కిరండల్ అనే పాసింజర్ ట్రైన్ ఉంటుంది. ఇందులో ఒక్కరికి రూ.45 టికెట్ ఉంటుంది. అరకు చేరుకున్నాక టెంట్ రెంట్ కి తీసుకుంటే రోజుకు రూ.800 కడితే సరిపోతుంది. ఇద్దరు స్టే చేయొచ్చు. 
తర్వాత అక్కడ ఫ్రెష్అప్ అయి ఆటో మాట్లాడుకుంటే మనిషికి రూ.250 తీసుకుంటారు. చుట్టుపక్కల ఉన్న సూపర్ వ్యూ పాయింట్స్ చూపిస్తారు. 

అవేంటంటే.. చాపరేయ్ వాటర్ ఫాల్స్, సన్ ఫ్లవర్ గార్డెన్, అరకు పైనరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం. ఇవన్నీ చూసి వచ్చే సరికి కచ్చితంగా సాయంత్రం అయిపోతుంది. నైట్ టెంట్ లో విశ్రాంతి తీసుకొని రెండో రోజు ఉదయం మళ్లీ ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిపోవచ్చు.

45

రెండో రోజు.. 
మీరు స్టే చేసిన చోటు నుంచి మడగడ వ్యూ పాయింట్ కు తెల్లవారుజామునే చేరుకోండి. ఎందుకంటే ఇక్కడ మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించడం చూస్తే మీరు మైమరచిపోతారు. ఆ తర్వాత కటిక వాటర్ ఫాల్స్ కి చేరుకొని జలపాతం వద్ద హాయిగా స్నానం చేస్తూ ఎంజాయ్ చేయండి. తర్వాత గాలికొండ వ్యూ పాయింట్ కు చేరుకొని అరకు కొండలు, లోయలను కనులారా తిలకించండి. తర్వాత దగ్గర్లోనే ఉన్న కాఫీ తోటల్లో అలా నడుస్తూ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆస్వాదించండి. నైట్ తిరిగి మీరు స్టే చేసిన టెంట్ వద్దకు వచ్చేసి హాయిగా నిద్రపోండి. ఉదయం లేని అరకు నుంచి తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం మొదలు పెట్టండి. 

55

ఇలా హైదరాబాద్ నుంచి అరకు వెళ్లి రావడానికి 4 రాత్రులు, 3 పగలు పడుతుంది. ఈ టూర్ ప్లాన్ మొత్తానికి ఒక్కో మనిషికి అయ్యే ఖర్చు రూ.3,500 మాత్రమే. మరి మీరూ ప్లాన్ చేసుకుంటారా?
 

click me!

Recommended Stories