అస్సాంలోని బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న అందమైన దీవి మజులి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నది ద్వీపంగా పేరు పొందింది. ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఈ దీవి మొత్తం 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
మజులి దీవి బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉండటంతో అక్కడికి వెళ్లడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ వెళ్తే మాత్రం తిరిగి రావడానికి కూడా ఇష్టపడరు. మజులి ద్వీపం చూడాలనుకునేవారు వర్షాకాలం తప్పా ఎప్పుడైనా వెళ్లచ్చు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.