ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ఆఫర్ ఎకానమీతో పాటు ప్రీమియం, బిజినెస్ క్లాసుల్లో అందుబాటులో వుంది. దేశీయంగా ఎకానమి క్లాస్ టికెట్ ధర కేవలం రూ.1499 మాత్రమే. ఇక ప్రీమియం ఎకానమీ రూ.3,749, బిజినెస్ క్లాస్ రూ.9,999 నుండి ప్రారంభం అవుతాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు అయితే ఎకానమీ టికెట్ ధర రూ.12,577 గా వుంది. ఇక ప్రీమియం ఎకానమీ రూ.16,213, బిజినెస్ క్లాస్ రూ.20,870 గా వుంది.
టిక్కెట్లను ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. కన్వీనియెన్స్ ఫీజు ఉండదు. పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే ఈ సేల్ వర్తిస్తుంది. కాబట్టి త్వరగా బుక్ చేసుకుంటే మంచిది.