TTD: శ్రీవారి భ‌క్తుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఉచితంగా VIP బ్రేక్ ద‌ర్శ‌నం. ఏం చేయాలంటే..

Published : May 14, 2025, 07:22 AM IST

తిరుమ‌ల శ్రీవారిని క‌నులారా ద‌ర్శించుకోవాల‌ని చాలా మంది కోరుకుంటారు. వేంక‌టేశ్వ‌ర స్వామిని ఒక్క క్ష‌ణం చూడ‌డం కోసం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాసాల‌కు ఓర్చుకొని మ‌రీ తిరుమ‌ల‌కు చేరుకుంటారు. ఇక వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అయితే సామాన్యుల‌కు అది కాస్త క‌ష్టంతో కూడుకున్న ప‌ని. కానీ తాజాగా టీటీడీ శ్రీవారి భ‌క్తుల కోసం వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.   

PREV
16
TTD: శ్రీవారి భ‌క్తుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఉచితంగా VIP బ్రేక్ ద‌ర్శ‌నం. ఏం చేయాలంటే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక వినూత్నమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్ల లోపు యువత కోటి సార్లు “గోవింద” నామాన్ని రాస్తే, వారు కుటుంబ సభ్యులతో పాటు ఉచితంగా VIP బ్రేక్ దర్శనం పొందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని "గోవింద కోటి" పేరుతో టీటీడీ ప్రత్యేకంగా ప్రారంభించింది.
 

26
Tirumala

ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా టీటీడీ యువతలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చింది. రామకోటి తరహాలోనే ఈ గోవింద కోటి కార్యక్రమంలో పాల్గొనాలంటే యువతకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వీటి ప్ర‌కారం.. 

36

వయసు పరిమితి: 25 ఏళ్లలోపు యువతకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.

గోవింద నామం సంఖ్య: 10,01,116 సార్లు గోవింద నామం రాయాలి.

పుస్తకాల అవసరం: ప్రతి పుస్తకంలో సుమారు 39,600 నామాలు రాయవచ్చు. మొత్తం కోటి నామాలు రాయాలంటే సుమారు 26 పుస్తకాలు కావాలి.

పూర్తి అయిన పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో సమర్పించాలి. అంగీకరించిన వెంటనే VIP బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తారు.
 

46
Tirumala

గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన అనే విద్యార్థిని తొలి వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఆమె బెంగళూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కోటి సార్లు గోవింద నామం రాసి టీటీడీకి అందజేసింది. తాను మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా VIP బ్రేక్ దర్శనం పొందే అవకాశం పొందారు. ప్రస్తుతం మరికొందరు యువత కూడా ఈ అవకాశం పొందారు.

56
Tirumala

గోవింద కోటి పుస్తకాలు ఎక్క‌డ ల‌భిస్తాయి:

టీటీడీ ఈ నామల పుస్తకాలను తన సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారా అందిస్తోంది. ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరికీ సులభంగా లభించేలాగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడే అవకాశం ఉన్నట్టు టీటీడీ అంచనా వేసింది.

66

సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలకు తిరిగి ఆమోదం:

ఇదిలా ఉంటే  వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా గతంలో టీటీడీ సిఫార్సుల ఆధారంగా బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భక్తుల రద్దీ కొద్దిగా తగ్గడంతో మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలను తిరిగి ప్రారంభించనుందని టీటీడీ ప్రకటించింది.

Read more Photos on
click me!

Recommended Stories