నాడు సాగర్ వద్ద ఘర్షణ: నేడు ఆ మూడు ప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత

First Published Jul 1, 2021, 1:14 PM IST

కృష్ణా నది జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలు  తమ వాటా ప్రకారంగా నీటిని వాడుకొనేందుకే ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకొన్నట్టు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. రెండు రాష్ట్రాలు తమ సరిహద్దుల వద్ద భారీగా పోలీసులను మోహరించాయి.
undefined
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని ఏపీ చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం వల్ల కూడ తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ వాదిస్తోంది.
undefined
ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరసిస్తూ గతంలో కూడ ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. మరోవైపు తాజాగా ఈ విషయమై స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేశారు.
undefined
అయితే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం రెండు సార్లు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జలవివాదంపై ప్రధానితో పాటు సంబంధిత మంత్రులకు లేఖలు రాయాలని జూన్ 30న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకొంది.
undefined
కేసీఆర్ ఫిర్యాదు చేసిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణ పనులను పరిశీలించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కేఆర్ఎంబీని ఆదేశించారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడిందని సమాచారం.
undefined
రెండు రాష్ట్రాలు కూడ తమ రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటా మేరకే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెబుతున్నాయి. తమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సమర్ధించుకొంటున్నాయి.
undefined
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ ఉంచకుండా ఉండేలా విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ పూనుకొందని ఏపీ ఆరోపిస్తోంది. తెలంగాణ ఎత్తులకు తాము పై ఎత్తులు వేస్తామని ఏపీ ప్రకటించింది.
undefined
ఏపీకి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడ రెండు రాష్ట్రాల మధ్య కూడ ఇదే రకమైన ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. నాగార్జునసాగర్ నుండి నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది.2015 ఫిబ్రవరి 13వ తేదీన నాగార్జునసాగర్ డ్యామ్ పై ఏపీ, తెలంగాణ పోలీసులు ఘర్షణకు దిగారు.
undefined
ఈ ఘర్షణ చోటు చేసుకొన్న మరునాడే ఫిబ్రవరి 14న రాజ్ భవన్ వేదికగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాలు నీటి పంపకాల విషయంలో ఘర్షణ తలెత్తకుండా చూసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.2015 ఫిబ్రవరిలో చోటు చేసుకొన్న తరహా పరిణామాలే ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద కన్పిస్తున్నాయి.
undefined
రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను చల్లారేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్పిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
undefined
click me!