సీఎం కేసీఆర్ మెడలువంచుతా... అప్పటివరకు నా పోరాటం ఆగదు: వైఎస్ షర్మిల

First Published Sep 14, 2021, 12:58 PM IST

నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించేవరకు తన దీక్షలు కొనసాగుతాయని... ఆయన మెడలు వంచి తీరతానని వైఎస్ షర్మిల అన్నారు. 

వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఇప్పటికే తెలంగాణలో అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారందరి తరపున కేసీఆర్ సర్కార్ తో పోరాడుతున్నరు వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల.

వారంలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నిరాహార దీక్ష చేపట్టారు. హ‌య‌గ్రీవ‌చారి గ్రౌండ్ ఎదురుగా షర్మిల దీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

అంతకుముందు హైదరాబాద్ నుండి వరంగల్ కు చేరుకున్నారు షర్మిల. ఈ సందర్భంగా కాక‌తీయ యూనివ‌ర్స‌టీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం వద్దకు చేరుకున్న ష‌ర్మిల పూల‌మాల వేసి, నివాళి అర్పించారు.

అనంతరం షర్మిల అక్కడే మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి చివరకు బలన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెతమంది చనిపోతే మీరు స్పందిస్తారు అంటూ సీఎంను నిలదీశారు షర్మిల.

నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని షర్మిల అన్నారు. పది వారాలుగా తాను నిరుద్యోగుల పక్షాన నిరాహాన దీక్ష చేస్తున్నానని... అయినా కేసీఆర్ సర్కార్ స్పందించడంలేదని అన్నారు. అయితే కేసీఆర్ మెడలు వంచేవరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూసి విసిగిపోయిన నిరుద్యోగి బోడ సునీల్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోనే ఆత్మహత్యాయత్న చేసుకున్న విషయం తెలిసిందే. అతడు ఆత్మహత్య చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం సునీల్ కుటుంబాన్ని ఆదుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

click me!