నెమలి కూర వీడియోపై యూట్యూబర్ ట్విస్ట్ :
యూట్యూబ్ లో పెట్టిన నెమలి కూర వీడియోపై ప్రణయ్ కుమార్ ట్విస్ట్ ఇచ్చాడు. అది నెమలి మాంసం కాదు.... కోడి మాంసమని చల్లగా బయటపెట్టాడు. యూట్యూబ్ లో వ్యూస్ కోసమే కోడి మాంసంతో కూర వండి నెమలి మాంసంగా బిల్డప్ ఇచ్చాడట. అటవీ అధికారులు కూడా అతడి ఇంట్లో నెమలిని చంపిన ఆనవాళ్ళు ఏమీ లేవన్నారు. కోడి ఈకలు మాత్రం లభించాయి... కాబట్టి అతడు వండింది చికెన్ అయివుంటుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. టెస్టుల్లో అది నెమలి మాంసం అని తేలితేమాత్రం సదరు యూట్యూబర్ ను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.
యూట్యూబ్ వీడియోలో పిచ్చిలో ఎంతకు తెగించాడు... కోడికూరను నెమలికూర చేసేసాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జాతీయ దినోత్సవం వేళ జాతీయ పక్షి నెమలి కూర వీడియో వ్యవహారం దుమారం రేపింది.