జియో, ఎయిర్ టెల్ లకు ఇక చుక్కలే ... తెలుగు రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రయోగం

First Published | Aug 9, 2024, 10:22 PM IST

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్రాల్లొ సరికొత్త ప్రయోగం చేస్తోంది. దీంతో ప్రైవేట్ టెలికాాం సంస్థల గుండెల్లో గుబులు మొదలయి వుంటుంది. ఇంతకూ బిఎస్ఎన్ఎల్ ప్రయోగం ఏమిటంటే..?

BSNL 5G

BSNL 5G : ఇటీవల జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ధరలు అమాంతం పెంచేసాక బిఎస్ఎన్ఎల్ పేరు బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ప్రైవేట్ కంపనీల రాకతో ఢీలా పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ అవే ప్రైవేట్ కంపనీల నిర్ణయాలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఇదే అదునుగా బిఎస్ఎన్ఎల్ కూడా ప్రజలు కోరుకుంటున్నట్లు మరింత మెరుగైన  సేవలు అందించేందుకు సిద్దమయ్యింది.
 

BSNL 5G

ఇప్పటికే ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు 5G సేవలు అందిస్తోంది. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4G సేవలనే దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందించలేకపోతోంది. ఇలా  ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే బాగా వెనకబడ్డ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడే స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా 4G నెట్ వర్క్ ను విస్తరిస్తూనే 5G సేవలను కూడా ప్రారంభించడానికి సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే దక్షిణాదిలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది బిఎస్ఎన్ఎల్.
 


BSNL 5G

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కేరళలోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం సరికొత్త సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. 5G రెడీ సిమ్ కార్డులను ఈ మూడు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే భవిష్యత్ లో 5G అందుబాటులోకి వచ్చాక   సిమ్ కార్డును మార్చాల్సిన అవసరం లేకుండా ఈ 5G రెడీ సిమ్ కార్డును అందిస్తున్నారు.  
 

BSNL 5G

ఈ 5G రెడీ సిమ్ కార్డును లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో వాడుకునేలా రూపొందించారు. ఇలా ప్రైవేట్ టెలికాం సంస్థల మాదిరిగానే 5G అందుబాటులోకి వచ్చాక సిమ్ కార్డును మార్చాల్సిన అవసరం బిఎస్ఎన్ఎల్ వినియోగాదారులకు కూడా వుండదన్నమాట. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా తెలంగాణ, ఏపీ, కేరళలోనే ఈ 5G రెడీ సిమ్ కార్డులు అందుబాటులో వున్నాయి...త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులో వుంచుతామని బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు.
 

BSNL 5G

ఇక ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 5G సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా  ఈ బిఎస్ఎన్ఎల్ 5G సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ నెట్ వర్క్ ను ఉపయోగించిన వీడియో కాల్ చేసారు మంత్రి సింథియా.

Latest Videos

click me!