ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగుకు 50 నుండి 57 మొక్కలు అవసరం అవుతాయి. ఇందుకోసం రూ.11,600 ఖర్చు అవుతుంది... ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇక మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్లకు దిగుబడి వస్తుంది. అప్పటివరకు రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా పంట నిర్వహణకోసం ఏడాదికి రూ.4,200 ఆర్ధికసాయం చేస్తుంది. ఇలా నాలుగేళ్లకు రూ.16,800 అందజేస్తుంది. డ్రిప్ కోసం ఎకరాకు 22,518 సబ్సిడీ అందిస్తోంది. ఇలా మొత్తంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులు రూ.50,000 పైగా సబ్సిడీ పొందవచ్చు.
ఇక దిగుబడి ప్రారంభమయ్యాక రైతులు లాభాలను పొందుతారు. ఇలా ఏకంగా 30ఏళ్ల వరకు నిరంతరం ఆదాయం అందుతూనే వుంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఆయిల్ ఫామ్ ధరలను బట్టి ఎకరాకు రెండు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ పంటకు పెద్దగా నీటి అవసరం లేదు... కాబట్టి నీటిఎద్దడి ప్రాంతాలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైనవే.