నిన్న (మంగళవారం) బంధువుల ఇంట శుభకార్యం వుండటంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంటినుండే పనిచేస్తున్న పెద్దకూతురు దీప్తి, చిన్నకూతురు చందన ఒకరికొకరు తోడుగా వుండటంతో రాత్రికి బంధువుల ఇంట్లోనే వున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ రాత్రి ఏమయ్యిందో తెలీదు దీప్తి ప్రాణాలు కోల్పోగా, చందన కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి సోఫాలో కూతురు మృతదేహం కనిపించింది. చిన్నకూతురు గురించి ఎంత వెతికినా కనిపించలేదు. ఇలా ఇద్దరు కూతుళ్లు ఒకేసారి దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.