తుదిదశలో యాదాద్రి పున:నిర్మాణం... శిల్పకళా సంపదతో సర్వాంగసుందరంగా ప్రధానాలయం

First Published Feb 21, 2021, 12:29 PM IST

ఇప్పటికే శిల్పకళా సంపదతో యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా తయారవగా పనులుమొత్తం పూర్తయితే మరింత సుందరంగా మారనుంది.  

యాద్రాద్రి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే శిల్పకళా సంపదతో ఆలయ ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా తయారవగా పనులుమొత్తం పూర్తయితే మరింత సుందరంగా మారనుంది.
undefined
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని యాద్రాద్రి దేవాలయ నిర్మాణ పనులను పలుమార్లు పర్యవేక్షించారు. ఇటీవల యాదగిరీశున్ని దర్శించుకున్న సీఎం నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సుమారు 1100 ఎకరాల్లో టెంపుల్ సిటీని అభివృద్ధిని చేస్తామని... ఈ టెంపుల్ సిటీలో 354 క్వార్టర్స్‌ నిర్మించనున్నట్టు తెలిపారు.
undefined
ఆగమ శాస్త్రం ప్రకారంగానే ఆలయ పునర్నిర్మాణం పనులను చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది జూన్ మాసం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తాయని చెప్పారు. బస్టాండ్, క్యూ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలను చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు.యాదాద్రి వద్ద ఆరు లైన్ల రింగు రోడ్డుకు కూడ నిధులను మంజూరు చేసినట్టు కేసీఆర్ చెప్పారు.
undefined
click me!