మీరు రుణమాఫీకి అర్హులైనా... రాకపోతే ఏం చేయాలి..?

First Published | Jul 19, 2024, 10:00 AM IST

తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం మీరు రుణమాఫీకి అర్హులా..? అయినా మీకు రుణమాఫీ కాకుంటే ఇలా చేయండి.

Rythu Runa Mafi

Rythu Runa Mafi : తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చినమాట ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ ప్రక్రియను ప్రారంభించింది రేవంత్ సర్కార్. హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. రైతులు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను మూడు విడతల్లో పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రుణమాఫీని ప్రారంభించి లబ్దిదారులతో ముచ్చటించారు. 
 

Rythu Runa Mafi

రుణమాఫీకి అర్హులైన 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6 వేల 98 కోట్ల నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఇప్పటికే లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. అయితే వివిధ కారణాలతో అన్ని అర్హతలున్నా కొందరికి రుణమాఫీ జరగలేదు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణమాఫీ పర్యవేక్షణ, ఫిర్యాదు పరిష్కార ఏర్పాటు చేసింది. 
 

Latest Videos


Rythu Runa Mafi

రుణమాఫీ కాకుంటే ఏం చేయాలంటే : 

మీరు వ్యవసాయం చేస్తున్నారా..? పెట్టుబడి కోసమో లేదంటే మరేదైనా అవసరాల కోసమే బ్యాంకులో రుణం తీసుకున్నారా..? ఈ బ్యాంకు లోన్ ప్రభుత్వం సూచించిన రుణమాఫీ  నిబంధనల ప్రకారం వుందా..? అయితే మీరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీకి అర్హులే. అయినప్పటికి మీ రుణం మాఫీ కాకుంటే ఇలా చేయండి.  
 

Rythu Runa Mafi

రుణమాఫీ పథకానికి సంబంధించి రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటుచేసింది. కాబట్టి రుణమాఫీ జరగనివారు అధికారిక ఐటీ పోర్టల్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు. 
 

Rythu Runa Mafi

ఇక రుణమాఫీ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం క్షేత్రస్థాయిలో కూడా ఓ పరిష్కార విభాగాన్ని ఏర్పాటుచేసారు. మండల స్థాయిలో ఓ సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసారు... ఈ మండల పరిధిలోని గ్రామాల రైతులు ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు.
 

Rythu Runa Mafi

ఇలా ఐటీ పోర్టల్, మండల సహాయక కేంద్రాల ద్వారా ఫిర్యాదులు అందిస్తే... 30 రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి మీరు అర్హులైనా రుణమాఫీ జరగకుంటే ఈ రెండు మార్గాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. 

ఇక మీరు లోన్ తీసుకున్న బ్యాంకును కూడా ఓసారి సంప్రదించండి. ఏదయినా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ డబ్బులు జమ కాకుంటే వారు పరిష్కరించే అవకాశం వుంటుంది.
 

Rythu Runa Mafi

వ్యవసాయ అధికారులను కూడా రుణమాఫీ సమస్యల పరిష్కారానికై సంప్రదించవచ్చు. అన్ని అర్హతలుండి రుణమాఫీ కాలేదంటే అందుకు కారణమేంటో వారికి తెలిసి వుంటుంది. కాబట్టి వారిద్వారా సమస్యను తెలుసుకుని పరిష్కరించుకునే అవకాశం వుంటుంది. 
 

click me!