Revanth Reddy
Rythu Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం రైతుల ఎదురుచూపులకు తెరదించుతూ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. రెండు లక్షలలోపు వ్యవసాయ రుణాలను మూడు విడతల్లో మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో లక్ష రూపాయల వరకు బ్యాంకు రుణాలున్న రైతుల ఖాతాల్లో ఇవాళ (జూలై 18 గురువారం) డబ్బులు జమ చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు... లబ్దిదారులతో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు. ఇలా 11 లక్షల 50 వేల మంది రైతులకు 6 వేల 98 కోట్ల నిధులు జమ చేసినట్లు సీఎం తెలిపారు.
Revanth Reddy
ఇప్పటికే అర్హులైన రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. ఒకవేళ ఎవరికైనా రుణమాఫీ కాకుంటే ముందుకు ఇందుకు కారణమేంటో గుర్తించాలి. అన్ని అర్హతలు వుండి లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ కాలేవంటే ఈ కింది అంశాలను ఓసారి పరిశీలించండి. ఇందులో ఏదయినా మీ రుణమాఫీ జరక్కపోడానికి కారణమేమో.
farmer
1. సాంకేతిక కారణాలు : అన్ని అర్హతలు కలిగివుండి మీకు రుణమాఫీ కాలేదంటే అందుకు సాంకేతిక కారణాలు వుండవచ్చు. కాబట్టి ఓసారి మీరు రుణం పొందిన బ్యాంక్ ను లేదంటే వ్యవసాయ అధికారిని సంప్రదించండి. రుణమాఫీ కాకపోడానికి కారణాలు వారికి తెలిసివుండచ్చు.
Farmer
2. ఈ రుణమాఫీ ఎస్‌హెచ్‌జి (మహిళా స్వయం సహాయక సంఘాలు), జెఎల్‌జి (జాయింట్ లయబిలిటీ గ్రూపులు), ఆర్ఎంజి, ఎల్ఇసిఎస్ లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది.
Farmers
3. ఈ రుణమాఫీ రీ షెడ్యూల్ లేదా పునర్వ్యవస్థీకరించిన రుణాలకు వర్తించదు. కాబట్టి మీ రుణాలు అలాంటివేమో చూసుకొండి.
agriculture survey begins in saudi
4. కంపనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు తెలంగాణ ప్రభుత్వం అందించే రుణమాఫీ వర్తించదని ఇప్పటికే ప్రకటించారు.
Farmers
5. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువమందికి వ్యవసాయ రుణాలుంటే ముందుగా మహిళల రుణాలను మాపీ అవుతాయి. కుటుంబాన్ని ఓ యూనిట్ గా తీసుకుని రుణమాఫీ ప్రక్రియ చేపట్టారు. కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా రుణమాఫీ జరిగివుంటే మీరు అనర్హులే.
Farmer
6.రుణమాఫీ డెడ్ లైన్ 12 డిసెంబర్ 2018 నుండి 09 డిసెంబర్ 2023 వరకు నిర్ణయించారు. ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది. అంతకు ముందుగానీ, ఆ తర్వాతగాని తీసుకున్న రుణాలు మాఫీ కావు.
Farmer
7. 2 లక్షలపై పైగా రుణం వుంటే కూడా రుణమాఫీ జరగదు. అర్హులుగా మారాలంటే ముందుగా 2 లక్షల లోపు మాత్రమే రుణాలుండాలి. కాబట్టి మిగతా రుణం తీర్చినతర్వాతే ఈ రుణమాఫీ వర్తిస్తుంది.