కేసీఆర్ సారు మారారు... మరి కారు గేరు మారుతుందా..!! 

First Published | Jun 27, 2024, 11:30 PM IST

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వుంది బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పరిస్థితి. అధికారాన్ని కోల్పోయి పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్నాక ఇప్పుడాయన మారారు... అయినా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
 
 

KCR

హైదరాబాద్ : కర్ణుడి చావులాగే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా సవాలక్ష కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారతీరు. బిఆర్ఎస్ పార్టీకి బలమైనా, బలహీనతయినా ఆయనే... పార్టీ గెలిచినా, ఓడినా  బాధ్యుడాయనే. ఇలా తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా రెండుసార్లు బిఆర్ఎస్ గెలుపుకు, ఇటీవల ఎన్నికల్లో ఓటమికి కారణం కేసీఆరే.  

KCR

వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం... రెండు సార్లూ ఆయనే ముఖ్యమంత్రి కావడంతో కేసీఆర్ అహంభావం పెరిగిందని...అక్కడే ఆయన పతనం ప్రారంభమయ్యిందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. పవర్ సెంటర్ గా మారిన ఆయన ప్రజలను, ప్రతిపక్షాలనే కాదు సొంతపార్టీ ఎమ్మెల్యేలు చివరకు మంత్రులను సైతం పట్టించుకోలేదు... తనకెవరు అడ్డుచెప్పేవారు లేకుండా పోవడంతో నిరంకుశ పాలన సాగించారని ప్రజల్లోకి బలంగా వెళ్లింది. . 

Latest Videos


KCR

 సెక్రటేరియట్ కు రాకుండా ప్రగతి భవన్ లేదంటే ఫార్మ్ హౌస్ నుండే పాలన సాగించేవారు కేసీఆర్. అలాగే ప్రజలను కలవడం పూర్తిగా మానేసారు... దీంతో ఆయనతో ప్రజలకు కనెక్టివిటీ తగ్గింది. దీంతో కేసీఆర్ ది దొరల మనస్తత్వం... అందువల్లే గడీల నుండే పాలిస్తున్నాడు అనే ప్రతిపక్షాల ప్రచారం ప్రజల్లోకి జోరుగా వెళ్లింది. ఇది చివరకు కేసీఆర్ కొంప ముంచింది. 

kcr

ఇక కేసీఆర్ తర్వాత ఆయన కుటుంబసభ్యులదే అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ పెత్తనం. కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు మంత్రులు... కూతురు ఎమ్మెల్సీ, సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు... ఇలా కేసీఆర్ కుటుంబసభ్యులందరికీ పదవులు. బిఆర్ఎస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో, సీఎం కొడుకుగా, కీలక శాఖల మంత్రిగా   ప్రభుత్వంలో కేటీఆర్ దే పెత్తనం. చివర్లో అయితే అసలు సీఎం కేసీఆరా లేక కేటీఆరా అన్నట్లుగా వుండేది. ఇలా కేసీఆర్ కుటుంబం కూడా బిఆర్ఎస్ ఓటమికి మరో కారణం. 

kcr

ఇలా బిఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయి... అవన్నీ కేసీఆర్ తో ముడిపడి వున్నవే. కాబట్టి  కేసీఆర్ మారితే అన్నీ మారతాయని... మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. అయితే అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ మారిపోయినట్లు కనిపిస్తోంది. 

KCR

గతంలో అసలు ప్రగతి భవన్ (ప్రస్తుత ప్రజా భవన్), ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ ల నుండి బయటకు వచ్చేవారే కాదు కేసీఆర్. కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజలను కలిసేందుకు బయటకు వస్తున్నారు కేసీఆర్. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు, నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా కేసీఆర్ పార్మ్ హౌస్ కు వచ్చే నాయకులు, కార్యకర్తల రద్దీ పెరిగింది. 

KCR

పార్టీ శ్రేణులనే కాదు తనకోసం వచ్చే సామాన్య ప్రజలను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. వారితో సరదాగా మాట్లాడుతూ ఫోటోలు దిగుతున్నారు. ఇక పార్టీ నాయకుల వెంటవచ్చే నాయకులు చిన్నాపెద్ద అని తేడా లేకుండా అందరితో మాట్లాడుతున్నారు...ఎవరేం చెప్పినా వింటున్నారు. ఇలా సీఎంగా వున్నప్పటికి కేసీఆర్ కు.... పదవి కోల్పోయాక కేసీఆర్ కు చాలా తేడా వుందని  బిఆర్ఎస్ నాయకులే చెబుతున్నారు. 

kcr

ఇలా కేసీఆర్ మారినా బిఆర్ఎస్ పరిస్థితి మారడంలేదు. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలోకి బిజెపి టార్గెట్ ఒకటే... బిఆర్ఎస్ లేకుండా చేయడం. ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు...ఇలా ఇప్పటికే కేసీఆర్ తో సన్నిహితంగా వుండే కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి బడా నేతలు కూడా పార్టీ మారారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు మారుతూనే వున్నారు. ఇలా రోజురోజుకి బిఆర్ఎస్ మరింత బలహీనపడుతోంది. కాబట్టి కేసీఆర్ మారడ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వుందని అటున్నారు. 

click me!