Weather Update : తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. ఈ జిల్లాల్లో యూపీ తరహా ఈదురుగాలులు, అల్లకల్లోలమే

Published : May 16, 2026, 08:32 AM IST

IMD Rain Alert : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు, మరోవైపు వానలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి ఈదురుగాలులు కూడా తోడవనున్నాయట… ఇవీ సాధారణమైనవి కావట… ఇటీవల యూపీలో అల్లకల్లోలం సృష్టించిన స్థాయిలో ఉంటాయట. 

PREV
15
రుతుపవనాలు ఎంటర్..

Monsoon Update :  వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరాయి. దీంతో ఈ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. త్వరలోనే ఈ రుతుపవనాలు దేశంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయట... ఇలా మండు వేసవిలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ తెలిపింది.

25
మే 22న కేరళంకు రుతుపవనాలు...

భారత వాతావరణ ఈ నెల మే 26 లోపు రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అంతకంటే ముందు ఇవి తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు సముద్రంలో ఏర్పడ్డాయట... అందుకే మే 22 నే ఇవి కేరళం చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తేన్నారు.

కేరళం చేరుకున్న నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయి. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల తీవ్రత తగ్గుతుంది... వర్షాలు మరింత జోరందుకుంటాయి. ఇలా ఈ నెలతో ఎండలు, ఉక్కపోత, వడగాలుల నుండి తెలుగు ప్రజలకు ఉపశమనం లభించనుందన్నమాట... జూన్ ఆరంభం నుండే చల్లని ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

35
ఈసారి లోటు వర్షపాతమే...

నైరుతి రుతపవనాల ఎంట్రీతో జూన్ నుండి వర్షాకాలం మొదలవనుందని IMD చల్లని కబురు అందించింది. దీంతో ప్రజలు మరీ ముఖ్యంగా రైతులు ఆనందంలో మునిగిపోయారు... ఈ సమయంలో తెలంగాణ వెదర్ మ్యాన్ బాంబ్ పేల్చారు. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తక్కువగా ఉంటాయని... చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతుందని ప్రకటించారు.

గత కొన్ని సంవత్సరాలుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి... కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని వెదర్ మ్యాన్ వెల్లడించారు. అందుకే ప్రజలు వర్షపు నీటిని పొదుపు చేయాలని... ఇవి భవిష్యత్ లో ఉపయోగపడతాయని సూచించారు. ముఖ్యంగా రైతులు కూడా నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను వేయాలని వెదర్ మ్యాన్ సూచించారు.

45
తెలంగాణలో బలమైన ఈదురుగాలులు...

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితే ఇవాళ (శనివారం) తెలంగాణలో ఉంటుందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, జనగాం, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందట. ఈ డేంజర్ గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు.

ఇక హైదరాబాద్ వాతావారణ కేంద్రం కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని... ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడా ఈ వర్షాలకు తోడయి బీభత్సం సృష్టించవచ్చని పేర్కొంది. సాయంత్రం సమయంలో హైదరాబాద్ లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

55
ఆంధ్ర ప్రదేశ్ లో వింత వాతావరణం...

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఇవాళ (మే 16, శనివారం) విజయనగరం,పార్వతీపురం మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇక ఆదివారం 19మండలాల్లో తీవ్రమైన, 30 మండలాల్లో సాధారణ స్థాయితో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుందని... మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని... వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories