'కోయ్ కోయ్... కోడిని కొయ్' అని ఎందుకు పాడానో తెలుసా?'

First Published | Jan 13, 2025, 10:37 AM IST

కోయారే కోయారే కోయ్... మామారే చందమామ...కోయ్ కోయ్ కోడ్ని కోయ్' ...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సాంగ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు సదరు పాస్టర్. ఇందులో కోడ్ని కోయ్ అన్న పదంవెనకున్న ఆసక్తికర స్టోరీని చాలా ఫన్నీగా తెలిపారాయన. అదేంటో చూద్దాం. 
 

koy koy Kodini koy

koy koy Kodini koy Song : 'కోయారే కోయారే కోయా... మామారే సందమామా...కోయ్ కోయ్ కోడ్ని కోయ్'.., ఓ పాస్టర్ పాడిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పాట ఏ బాషలో వుందో, అర్థమేంటో తెలీదు... ఆ పాస్టర్ ఎవరో తెలీదు...  కానీ పాట మాత్రం సూపర్ హిట్ మూవీ సాంగ్స్ ను తలదన్నేలా ప్రజల్లోకి వెళ్లింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ కోయ్ కోయ్ అంటూ రీల్స్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఓపెన్ చేయగానే 'కోయ్ కోయ్ కోడ్ని కొయ్' అంటూ ఫన్నీ హావభావాలతో పాస్టర్ వీడియోలు కనిపిస్తున్నాయి. 

గతేడాది చివర్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ పాస్టర్ ఊహకందని గుర్తింపు లభించింది. ఆయన పాటలు లక్షలాదిమందికి చేరాయి... లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. కోయారే కోయారే కోయ్ పాట లిరిక్స్ ఒకెత్తయితే అతడి హావభావాలు మరోఎత్తు... వెరిసి ఈ పాస్టర్ ను ఓవర్ నైట్ ఫేమస్ చేసాయి. ఇప్పుడు కోయారే సాంగ్ కు, ఆ పాస్టర్ కు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది ఫ్యాన్స్ తయారయ్యారు. 

అయితే ఈ కోయ్ కోయ్ సాంగ్ లో కోడిని కొయ్ అనే పదం వుంటుంది...ఇది ఓ సంఘటన తర్వాత చేర్చబడిందని సదరు పాస్టర్ వివరించారు. ఈ కోడిని కొయ్ పదం వెనకున్న స్టోరీని తాజాగా బైటపెట్టారు. ఆయన పాటలే కాదు మాటలు కూడా ఎంతో ఫన్ పంచేలా వుంటాయి. 
 

koy koy Kodini koy

'కోడిని కొయ్' పదానికి ఇంత స్టోరీ వుందా?

ఖమ్మం జిల్లాకు చెందిన క్రిస్టియన్ మతబోధకుడు మీసాల గురప్ప ఓసారి పల్లెటూరుకు వెళ్లాడట. మత బోధనకు ముందు ఆయనకు భోజనం చేయడం అలవాటు... కాబట్టి ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబం భోజన ఏర్పాట్లు చేసిందట. ఏం వండాలని అడిగితే నాటుకోడి చాలా ఇష్టమని ... అది వండాలని సూచించినట్లు పాస్టర్ తెలిపారు. 

అయితే తనపై ప్రేమతో ఆ కుటుంబం ఊళ్ళో నాటుకోళ్లు దొరక్కపోతే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతికారట. కానీ ఎక్కడా దొరక్కపోయేసరికి ఎక్కడ పాస్టర్ కు ఇష్టమైన కూరను వడ్డించలేమేమోనని బాధపడుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందట. పక్కింటివాళ్లు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న నాటుకోడి వీళ్ల ఇంట్లోకి వచ్చిందట... ఇదే అదునుగా ఆ కోడిని టక్కున పట్టుకుని కోసి కూర వండారని పాస్టర్ తెలిపారు. 

తాను ఆ గ్రామానికి వెళ్లేసరికే సాయంత్రం అయ్యింది... మతబోధనకంటే ముందే తనకు భోజనం ఏర్పాటుచేసినవారి ఇంటికి వెళ్లానని పాస్టర్ తెలిపారు. మండువేసవి కావడంతో ఇంట్లో ఉక్కపోతగా వుంటుందని మేడపై భోజనానికి ఏర్పాట్లు చేసారు. తాను వెళ్లి నాటుకోడి కూరతో భోజనం చేస్తుండగా పక్కింటివాళ్లు ఎవరితో  ఘోరంగా తిడుతున్నారు... ఆ తిట్లు తనకు వినిపించాయని తెలిపాడు. 

ఎవరినో తిడుతున్నారు కదా అనుకుని పట్టించుకోకుండడా తాను భోజనం చేస్తున్నాను... ఈ సమయంలో వంటవండిన ఇంటావిడ ఓ మాట అందట. ఈ పక్కింటోళ్లు తిడుతున్నది ఎవరినో కాదు మిమ్మల్నే...వాళ్ల కోడినే మీరు తింటున్నారు అని చెప్పిందట. మా కోడిని కోసుకుని తిన్నోడు చావ అంటూ ఆమె తిడుతోంది... అది తననే అని అప్పుడు అర్థమైందన్నారు.   అతిథికి దొంగకోళ్లను పట్టి కూర వండి పెట్టారా అంటూ ఆశ్చర్యపడటం తప్ప తాను చేసేదేమీ లేకపోయిందన్నారు. 

ఎలాగోలా భోజనం ముగించుకుని మత బోధన కోసం ఏర్పాటుచేసిన స్థలానికి చేరుకున్నాను... కానీ అక్కడ ముందు వరుసలోనే తాను తిన్న కోడి యజమాని వున్నాడు. తాను కోయ్ కోయ్ అంటూ పాడుతుంటే అతడికి ఏం అర్థమయ్యిందో కానీ ...కోయ్ కోయ్ కోడ్ని కొయ్ అంటూ పాడాడని తెలిపాడు. ఈ పాట విన్నవారు పగలబడి నవ్వారని... ఇదేదో బాగుందని అప్పటినుండి కోయ్ కోయ్ పాటలో కోడ్ని కోయ్ పదం చేర్చినట్లు పాస్టర్ గురప్ప వెల్లడించారు. ఇలా కోడ్ని కొయ్ పదం పుట్టుక వెనకున్న స్టోరీ గురించి చాలా ఫన్నీగా వివరించారు పాస్టర్. 


koy koy Kodini koy

కోయ్ కోయ్ పాస్టర్ అసలు పేరేంటో తెలుసా?  

కోయ్ కోయ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ పాట పాడిన పాస్టర్ ఎవరు? అనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అతడు మన తెలంగాణకు చెందినవాడే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. 

కోయ్ కోయ్ పాస్టర్ అసలుపేరు మీసాల గురప్ప. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం కుంట అతడి స్వస్థలం. అతడు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వుండే కోయ జాతికి చెందినవాడు. అడవిలోనే అతడు పుట్టిపెరిగాడు.  

గురప్ప తన జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలను బైటపెట్టాడు. అవి నమ్మశక్యంగా లేకున్నా ఆసక్తికరంగా వున్నారు. మీసాల గురప్ప తండ్రిపేరు ఆంబోతు అంకన్న. అతడు పెద్ద క్షుద్ర మాంత్రికుడు. వందలమంది తాంత్రికులను తయారుచేసాడట. ఇక అతడి తల్లి చిన్నప్పుడే చనిపోయిందట. తన జాతికోసమే కోయ్ కోయ్ పాట రాసినట్లు పాస్టర్ గురప్ప తెలిపారు. 

ఇది కూడా చదవండి :

కోయ్ కోయ్ సాంగ్ లో ఇంతర్థం వుందా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పాస్టర్ ఎవరో తెలుసా?

Latest Videos

click me!