Telangana Jobs
Telangana Jobs : తెలంగాణలో మరో జాబ్స్ నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో IT Instructor (ఐటీ ఇన్స్ స్ట్రక్టర్), PRO (పిఆర్వో) ఉద్యోగాల భర్తీకి విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాల దరఖాస్తులు ఎలాంటి ఫీజు లేదు... అలాగే ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లోనే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యింది. రేపే (జనవరి 10) చివరి తేదీ. కాబట్టి అభ్యర్థులకు కేవలం ఇంకా ఒక్కరోజే సమయం వుంది. కాబట్టి వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొండి.
ఉద్యోగ ఖాళీలు :
సాంఘీక సంక్షేమ శాఖల ఐటీ ఇన్స్ స్ట్రక్టర్స్, పిఆర్వో - 65 ఖాళీలు
విద్యార్హతలు :
ఐటీ ఇన్స్ స్ట్రక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎంటెక్ లేదా బిటెక్ లేదా ఎంసిఏ కంప్యూటర్స్ పూర్తిచేసి వుండాలి.
పిఆర్వో ఉద్యోగాలకు జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. వీరికి విద్యార్హతలతో పాటు 10 ఏళ్లు జర్నలిజంలో పనిచేసిన అనుభవం వుండాలి.
వయో పరిమితి :
అభ్యర్థుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుండి 42 ఏళ్లమధ్య వుండాలి. ఎస్సి, ఎస్టి, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు వుంటుంది.
సాలరీ :
ఈ ఐటీ ఇన్స్ స్ట్రక్టర్ తో పాటు పిఆర్వో ఉద్యోగాలకు ఎంపికయ్యేవారికి నెలకు రూ.35,000 వరకు సాలరీ వుంటుంది. అలాగే ప్రభుత్వం నుండి అలవెన్సులు, బెనిఫిస్ట్ కూడా వస్తాయి.
దరఖాస్తు విధానం :
పైన పేర్కొన్న విద్యార్హతలు, వయసు కలిగిన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో దేశోద్దారక భవన్ లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయి. వాటిని నేరుగా తీసుకుని ఫిల్ చేయాలి. సంబంధిత పత్రాలను జతచేసి దరఖాస్తు ఫారంను అధికారులకు అందించారు. రేపు (జనవరి 10) సాయంత్రం 4 గంటలలోపు మాత్రమే ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. అప్పట్లోపు దరఖాస్తులు అందించాలి.
అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే. కాబట్టి వెంటనే అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగాలను పొందే అవకాశం వుంటుంది.
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు :
విద్యార్హత సర్టిఫికేట్స్ (10th, Intermediate, Degree and PG Certificates)
స్థానికత కోసం ఒకటవ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ (బోపఫైడ్)
కుల దృవీకరణ పత్రం
10 ఏళ్ల అనుభవాన్ని నిర్దారించే సర్టిఫికేట్
ఎంపిక ప్రక్రియ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ తో పాటు ఇతర విషయాల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాతపరీక్ష వుండదు. గురుకుల విద్యాలయాల ఉన్నతోద్యోగులు అభ్యర్థుల ఎంపిక చేపడతారు.
మరిన్ని వివరాల కోసం గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :
మీ కలల జాబ్స్ కోసం ... చాట్ జిపిటి హెల్ప్ తీసుకోండిలా
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ ... అప్లికేషన్స్ కూడా ప్రారంభం, వెంటనే అప్లై చేసుకొండి