కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుంది. అయితే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్‌లో చేరికలతో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అసంతృప్త నేతలకు పార్టీ నాయకత్వం సర్ధి చెబుతున్నా ఫలితం లేకుండాపోతోంది.
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
రానున్న రోజుల్లో మరికొందరు నేతలు కూడ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అదే జరిగితే కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో గత నెల 28న చేరారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించనుంది కాంగ్రెస్. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ కేటాయిస్తుంది. మల్కాజిగిరి నుండి మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుండి మైనంపల్లి రోహిత్ పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
దీంతో ఈ రెండు అసెంబ్లీ స్థానాల నుండి కాంగ్రెస్ టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకున్నారు. అయితే ఈ స్థానం నుండి మైనంపల్లి రోహిత్ ను కాంగ్రెస్ బరిలోకి దింపనుందని తేలడంతో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ తీరుపై తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
మరోవైపు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి నందికంటి శ్రీధర్ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మైనంపల్లి హన్మంతరావుకే టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని తేలడంతో నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నందికంటి శ్రీధర్ మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరికతో రెండు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ లో చేరడాన్ని నాగం జనార్థన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. నాగర్ కర్నూల్ నుండి పోటీ చేస్తానని నాగం జనార్థన్ రెడ్డి తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
మరో వైపు ఇదే జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. అయితే ఇదే స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును మాజీ ఎమ్మెల్యే జగదీశ్వరరావు ఆశిస్తున్నారు. జగదీశ్వరరావు నాగం జనార్థన్ రెడ్డికి సన్నిహితుడు. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో జగదీశ్వరరావు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇంతకాలం పార్టీని కాపాడితే ఎన్నికల సమయంలో వచ్చిన జూపల్లి కృష్ణారావుకు టిక్కెట్టు ఇస్తారా అని జగదీశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. జూపల్లి కృష్ణారావుకు టిక్కెట్టు ఇచ్చినా తాను బరిలో ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు:కొత్త నేతల చేరిక, పార్టీని వీడుతున్న నేతలు
గద్వాల అసెంబ్లీ స్థానం నుండి ఇటీవలనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సరితతిరుపతయ్య టిక్కెట్టును ఆశిస్తున్నారు. అయితే మొదటి నుండి కాంగ్రెస్ లో ఉన్న డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి విజయ్ కుమార్, రాజీవ్ రెడ్డి, బలిగెర నారాయణ రెడ్డిలు కూడ టిక్కెట్టును ఆశిస్తున్నారు.గత మాసంలోనే డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి వర్గం గాంధీ భవన్ ముందు ఆందోళన నిర్వహించింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించవద్దని కోరింది.