కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో భువనగిరి అసెంబ్లీ టిక్కెట్టు కాంగ్రెస్ పార్టీ ఎవరికి కేటాయిస్తుందోననే చర్చ తెరపైకి వచ్చింది. రెండు మాసాల క్రితం ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే మూడు రోజుల క్రితం బీఆర్‌ఎస్ ను వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అనిల్ కుమార్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది.
Revanth Reddy, Telangana
భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది జూలై 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ లో చేరిన సమయంలో తనకు ఇచ్చిన హామీపై సరైన స్పందన లేకపోవడం ఇతరత్రా కారణాలతో ఆ పార్టీని వీడారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మూడు రోజుల క్రితం కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి చేరి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. దీంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఈ నెల 16న జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేయడంతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటేసింది.
కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే భువనగిరి అసెంబ్లీ నియోకవర్గం నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారాయి. కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు ఎవరికి దక్కుతుందోననే చర్చ ప్రారంభమైంది.
టీపీసీసీ చీఫ్ పదవి కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య పోటీ నెలకొందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఇతర నేతలకు పార్టీలో మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ లో చేరకముందు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సానుకూల వాతావరణం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.అయితే రెండు మాసాల క్రితం బీఆర్ఎస్ లో చేరి తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో అనిల్ కుమార్ రెడ్డిని ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఆందోళన కూడ ఆయన వర్గీయుల్లో లేకపోలేదు.కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోల్ టీమ్ సూచన మేరకు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానించిందనే ప్రచారం కూడ లేకపోలేదు.
అయితే భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో జిట్టా బాలకృష్ణారెడ్డి వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు వర్గాలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
revanth reddy
కుంభం అనిల్ కుమార్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మద్దతుందని ఆయన వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతుందనే ప్రచారం సాగుతుంది. అయితే భువనగిరి అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో ఎవరిదిపై చేయి కానుందో రానున్న రోజుల్లో తేలనుంది.