నైట్ కర్ఫ్యూ తొలి రోజు దృశ్యాలు: హైదరాబాదు రోడ్లు నిర్మానుష్యం (పొటోలు)

First Published Apr 21, 2021, 10:43 AM IST

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. 

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
undefined
తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
undefined
ఈ నెల ఏప్రిల్ 20 వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
undefined
కర్ఫ్యూ మొదటి రోజైన మంగళవారం రాత్రి తొమ్మిదికంటే ముందే హైదరాబాద్ నిర్మానుష్యంగా మారిపోయింది.
undefined
రంగురంగులు దీపాల కాంతులతో అర్ధరాత్రి కూడా రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతం కర్ఫ్యూ వల్ల జనాలు లేక బోసిపోయింది.
undefined
ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీతో హడావుడిగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతం ఎడారిని తలపిస్తోంది.అత్యవసరం అయితే తప్ప బైటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
undefined
నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.
undefined
రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
undefined
మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.
undefined
అంతరాష్ట్ర, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నిత్యావసర, అత్యవసర , ఇతర సరుకుల రవాణా కోసం ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల తర్వాత ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
undefined
click me!