
Telangana Jobs : తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది... భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) 1,743 (1000 డ్రైవర్, 743 శ్రామిక్స్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపడుతున్న ఈ భర్తీ ప్రక్రియలో ఉద్యోగాలన్నీ తెలంగాణ ఆర్టిసికి చెందినవే. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (TGSRTC) లో డ్రైవర్లతో పాటు ఇతర టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
కేవలం పదో తరగతి చదివుంటే చాలు… రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, మంచి సాలరీ ఉంటుంది కాబట్టి పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ జాబ్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ కావచ్చు. కాబట్టి తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి... ఉద్యోగాలను పొందండి.
తెలంగాణ ఆర్టిసిలో డ్రైవర్ ఉద్యోగాలకు కేవలం పురుషులే కాదు మహిళలు కూడా అర్హులే. తాజా నోటిఫికేషన్ లో ప్రకటించిన ఉద్యోగాలకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్టిసి బస్ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 22 ఏళ్ల వయసుండాలి. అలాగే 35 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు. జూలై 1, 2025 నాటికి వయసును పరిగణలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు (ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ వంటి విభాగాల్లో పనిచేసినవారు) 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. పదో తరగతి సర్టిఫికెట్స్ లేదా అందుకు సమానమైన స్టడీ సర్టిఫికెట్స్ లో డేట్ ఆఫ్ భర్త్ ను పరిగణలోకి తీసుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థల నుండి పదో తరగతి లేదా అందుకు సమానమమైన చదువు చదివుండాలి. జూలై 1, 2025 నాటికి ఈ విద్యార్హతలు కలిగివుండాలి.
తప్పనిసరిగా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికిల్ (HPMV) లైసెన్స్ కలిగివుండాలి. హెవీ గూడ్స్ వెహికిల్ (HGV) లేదా ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ నడిపించిన 18 నెలల అనుభవం ఉండాలి.
అభ్యర్థులు మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కలిగివుండాలి. కంటిచూపు, వినికిడి బాగుండాలి... ముఖ్యంగా కలర్ బ్లైండ్ నెస్ ఉండకూడదు. మెడికల్ టెస్ట్ తర్వాతే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
తెలంగాణ ఆర్టిసి శ్రామిక్స్ ఉద్యోగాలకు కూడా పురుషులతో పాటు మహిళలు కూడా అర్హులే.
18 ఏళ్లనుండి 30 ఏళ్లలోపు వయసుగలవారు అర్హులు. ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థుకు 5, మాజీ సైనికులకు 3 వయసు సడలింపు ఉంటుంది.
ఐటిఐ లో మెకానిక్ (డీజిల్ లేదా మోటార్ వెహికిల్) లేదా షీట్ మెటల్/ఎంవిబిబి లేదా ఫిట్టర్ లేదా ఎలక్ట్రిషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కట్టింగ్ వంటివి పూర్తిచేసివుండాలి.
తెలంగాణ ఆర్టిసిలో డ్రైవర్ లేదా శ్రామిక్స్ ఉద్యోగాలపై ఆసక్తి, అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 8వ తేదీ 8AM నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TSLPRB అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు కేవలం రూ.300 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.600 ఫీజు ఉంటుంది.
శ్రామిక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.400 ఫీజు ఉంటుంది.
డ్రైవర్ ఉద్యోగాన్ని సాధిస్తే నెలకు రూ.20,960 నుండి రూ.60,080 వరకు జీతం పొందవచ్చు.
శ్రామిక్స్ ఉద్యోగులకు నెలకు రూ.16,550 నుండి 45,030 వరకు జీతం లభిస్తుంది.
తెలంగాణ ఆర్టిసిలో భర్తీ చేయనున్న డ్రైవర్ ఉద్యోగాల్లో అత్యధికం హైదరాబాద్ లోనే ఉన్నాయి. మొత్తం 1000 డ్రైవర్ ఉద్యోగాల్లో 148 హైదరాబాద్, 93 మేడ్చల్, 88 రంగారెడ్డి, 59 సంగారెడ్డి, 41 హన్మకొండ, 31 నల్గొండ, 34 వికారాబాద్, 34 కొత్తగూడెం, 30 కామారెడ్డి, 49 నిజామాబాద్, 44 ఖమ్మం, 24 మంచిర్యాల, 22 సూర్యాపేట, 29 వరంగల్, 31 మహబూబాబాద్, 21 జనగామ, 21 ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి.