Telangana Job Calendar 2024-25 ... కొలువుల జాతర... జాబ్ నోటిఫికేషన్స్, పరీక్షల పూర్తి డిటెయిల్స్

First Published Aug 2, 2024, 11:34 PM IST

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. దీని ప్రకారం ఏ జాబ్ ఎప్పుడు; ఎలా భర్తీకానుంది... భర్తీ చేసేదెవరు... విద్యార్హతలేంటి... ఇలాంటి వివరాలతో కూడిన సంపూర్ణ సమాచారం మీకోసం...  

Telangana Job Calendar 2024-25

Telangana Job Calendar 2024-25 : తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 సంవత్సరాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసారు. ఏ ఉద్యోగాలను ఎప్పుడు, ఎలా భర్తీ చేయనున్నారో ఇందులో పేర్కొన్నారు. అయితే ఎన్ని ఉద్యోగాల భర్తీ చేపడతారో ఈ జాబ్ క్యాలెండర్ లో పేర్కొనలేదు... నోటిఫికేషన్ సమయంలోనే భర్తీ చేసే పోస్టుల సంఖ్యను వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.  
 

Telangana Job Calendar 2024-25

మొత్తంగా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆయా ఉద్యోగాలక భర్తీ తేదీలకు తగినట్లుగా సన్నద్దం అవడానికి నిరుద్యోగులకు అవకాశం దొరుకుతుంది. అంతేకాదు నియాయమ ప్రక్రియ కూడా ఓ క్రమ పద్దతిలో జరుగుతుంది. ప్రతి ఏటా ఇలా జాబ్ క్యాలెండర్ ముందుగానే విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభత్వం చెబుతోంది. 

Latest Videos


Telangana Job Calendar 2024-25

జాబ్ క్యాలెండర్  2024-25 :

1. గ్రూప్ 1 మెయిన్స్: ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది (ఫిబ్రవరిలోనే) - టిజిపిఎస్సి (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్) ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది - విద్యార్హతలు :  గ్రాడ్యుయేషన్ (కొన్ని పోస్టులకు ప్రత్యేక క్వాలిఫికేషన్స్)   -  2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు పరీక్షలు వుంటాయి. 

Telangana Job Calendar 2024-25

2. గ్రూప్ 3 సర్వీసెస్: డిసెంబర్ 2022 లోనే నోటిఫికేషన్ వెలువడింది - 2024 నవంబర్ 17-18 తేదీల్లో పరీక్షలు ‌- విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్ (కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలు)
 

Telangana Job Calendar 2024-25

3. ల్యాబ్ టెక్నీషియన్/ నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్)/ ఫార్మసిస్ట్ : సెప్టెంబర్ 2024 లో నోటిఫికేషన్ -  నవంబర్ 2024 లో పరీక్షలు ‌- విద్యార్హతలు : ఆయా పోస్టులకు తగిన విద్యార్హతలు వుండాలి.
 

Telangana Job Calendar 2024-25

4.గ్రూప్ 2 సర్వీసెస్ : డిసెంబర్ 2022 లోనే నోటిఫికేషన్ - డిసెంబర్ 2024 లో పరీక్షలు ‌‌- గ్రాడ్యుయేషన్ (కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలు)
 

Telangana Job Calendar 2024-25

5. ఇంజనీరింగ్ పోస్టులు (TGTRANSCO,TGNPDCL, TGSPDCL) - అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీ -    అక్టోబర్ 2024 లో నోటిఫికేషన్ -  జనవరి 2025 లో పరీక్షలు ‌‌- విద్యార్హతలు : బిఈ, బిటెక్,డిప్లోమా మరియు ఇతర అర్హతలు 
 

Telangana Job Calendar 2024-25

6. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసులు : అక్టోబర్ 2024 నోటిఫికేషన్ -  జనవరి 2025 పరీక్షలు ‌- విద్యార్హతలు :  బిఈ లేదా బిటెక్ 
 

Telangana Job Calendar 2024-25

7. టీచర్ అర్హత టెస్ట్ (టెట్) - ఉపాధ్యాయుల నియామకం కోసం - నవంబర్ 2024 లో నోటిఫికేషన్ - జనవరి 2025 లో పరీక్ష -  స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహణ - విద్యార్హతలు ;  బిఎడ్ లేదా డిఎడ్  
 

Telangana Job Calendar 2024-25

8. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ‌- 2022 లో విడుదల చేసిన జీవో నం.55 పేర్కొన్న 19 కేటగిరీల ఉద్యోగాల భర్తీ -  అక్టోబర్ 2024 నోటిఫికేషన్ - ఫిబ్రవరి 2025 పరీక్ష -  టిజిపిఎస్సి ద్వారా భర్తీ -  విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్ (కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలు)
 

Telangana Job Calendar 2024-25

9.గెజిటెడ్ హోదా ఉద్యోగాలు (గ్రూప్స్ కాకుండా) - జనవరి 2025 నోటిఫికేషన్‌ - ఏప్రిల్ 2025 పరీక్ష - విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 
 

Telangana Job Calendar 2024-25

10. డిఎస్సి : టీచర్స్ నియామకం కోసం -  ఫిబ్రవరి 2025 నోటిఫికేషన్ -  ఏప్రిల్ 2025 పరీక్ష -  స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా భర్తీ - విద్యార్హతలు :  డిగ్రీ తో కూడిన బిఎడ్, ఇంటర్ తో కూడిన డిఎడ్   
 

Telangana Job Calendar 2024-25

11. ఫారెస్ట్ బీట్ ఆపీసర్స్ - ఫిబ్రవరి 2025 నోటిఫికేషన్ -  మే 2025 పరీక్షలు - టిజిపిఎస్సి ద్వారా భర్తీ - విద్యార్హతలు :  ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన కోర్సు  
 

Telangana Job Calendar 2024-25

12. టీచర్ అర్హత పరీక్ష (టెట్): ఏప్రిల్ 25 లో నోటిఫికేషన్ - జూన్ 2025 లో పరీక్ష‌ - విద్యార్హతలు -  బిఎడ్ లేదా డిఎడ్  
 

Telangana Job Calendar 2024-25

13. గ్రూప్ 1 మెయిన్స్ :  జూలై 2025 లో పరీక్షలు ... ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ మెయిన్స్ రాస్తారు. 
 

Telangana Job Calendar 2024-25

14. ఎస్సై (సివిల్): ఏప్రిల్ 2025 నోటిఫికేషన్  - ఆగస్ట్ 2025 పరీక్ష -  టిజిపిఆర్బి ద్వారా భర్తీ - విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్ 
 

Telangana Job Calendar 2024-25

15. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) - ఏప్రిల్స్ 2025 నోటిఫికేషన్ - ఆగస్ట్ 2025 పరీక్ష - విద్యార్హతలు : ఇంటర్మీడియట్    
 

Telangana Job Calendar 2024-25

16. డిగ్రీ కాలేజ్ అకడమిక్ పోస్టులు :  జూన్ 2025 నోటిఫికేషన్ -  సెప్టెంబర్ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు.   

Telangana Job Calendar 2024-25

17. రెసిడెన్షియల్ కాలేజ్ డిగ్రీ లెక్చరర్ -  జూన్ 2025 నోటిఫికేషన్ -  సెప్టెంబర్ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు
 

Telangana Job Calendar 2024-25

18. గ్రూప్ 2 (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫోస్టులతో కలిపి) -  మే 2025 నోటిఫికేషన్ ‌-  అక్టోబర్ 2025 పరీక్షలు - టిజిపిఎస్సి ద్వారా భర్తీ   

Telangana Job Calendar 2024-25

9. గ్రూప్ 3 సర్వీసెస్ - జూలై 2025 నోటిఫికేషన్ విడుదల  - నవంబర్ 2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Telangana Job Calendar 2024-25

20. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు -  జూలై 2025 నోటిఫికేషన్ విడుదల -  నవంబర్ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు.

click me!