కరెంట్ పోతే కొంపలేం మునిగిపోవు.. ఫించన్లు లేటైతే బ్రహ్మాండమేం బద్దలవదంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

First Published | Aug 1, 2024, 11:45 PM IST

కాంగ్రెస్ పాలనతో తెలంగాణ కరెంట్ కోతలతో అందకారంగా మారుతోందన్న ప్రతిపక్షాల విమర్శలకు అసెంబ్లీ సాక్షిగా కౌంటర్ ఇచ్చారో ఎమ్మెల్యే. కానీ ఆయన వ్యాఖ్యలు సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టేలా వున్నాయి... ఇంతకూ ఎమ్మెల్యే ఏమన్నారంటే... 

Telangana Assembly

Telangana Assembly : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. కేసీఆర్ పాలనలో రెప్పపాటయినా కరెంట్ పోయేది కాదు... కానీ రేవంత్ పాలనలో కరెంట్ వుంటేనే ఆశ్చర్యపోయే పరిస్థితి వుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులంతా కరెంట్ కోతలే లేవని... ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ బిఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తున్నారు.  

Telangana Assembly

ఇలా విద్యుత్ కోతల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం సాగుతోంది. ఈ సమయంలో ఏకంగా అసెంబ్లీ వేదికన అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. కరెంట్ కోతలను సమర్దించేలా కామెంట్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు సదరు ఎమ్మెల్యే. 

Latest Videos


Telangana Assembly

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్కిల్ వర్సిటీ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా వుందని... అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కిందన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. 

Telangana Assembly

అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రతిపక్షాలకు కనిపించడంలేదు... కరెంట్ పోయింది, పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.  సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు ఇవేనా అంటూ ప్రశ్నించారు. 

Telangana Assembly

అయినా అరగంట కరెంట్ పోతే కొంపలు మునిగిపోతాయా? ప్రతిపక్ష నాయకులు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలంటూ  కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక నెల పదిహేను రోజులు పించన్లు ఆలస్యమైతే ప్రళయం వస్తుందా... బ్రహ్మాండం బద్దలవుతుందా..? అంటూ కామెంట్ చేసారు. ఇలా కరెంట్ కోతలు, ఫించన్ల ఆలస్యం నిజమే అనేలా అసెంబ్లీ వేదికగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. 

Telangana Assembly

అధికారం పార్టీ ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రజలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు వున్నాయంటున్నారు. సొంత ఎమ్మెల్యేనే కరెంట్ కోతలున్నాయి... ఫించన్లు ఆలస్యం అవుతున్నాయి అనేలా మాట్లాడుతున్నారు... ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. 

click me!