తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఎల్బి స్టేడియంలోనే...: సీఎం రేవంత్ ఇంట్రెస్టింట్ కామెంట్స్...

First Published | Aug 2, 2024, 7:10 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుల సభలో ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఎల్బి స్టేడియంలోనే వుందన్నారు.. ఆయన ఎందుకలా అన్నారంటే.. 

Telangana

Revanth Reddy :  30వేల గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నది 26 లక్షలమంది విద్యార్థులు... కానీ కేవలం 10వేల ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నది 33 లక్షలమంది... ఈ లెక్కలు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితికి అద్దం పడ్డుతున్నాయి. ఈ లెక్కలు బైటపెట్టింది ఎవరో కాదు...స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ వివరాలను బైటపెట్టారు. తద్వారా పనితీరు మెరుగుపర్చుకోవాలని ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెప్పకనే చెప్పారు సీఎం.

Telangana

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. దీంతో ఏళ్ళ తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూసిన టీచర్లు ఆనందంలో మునిగిపోయారు. ఇలా  పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఇవాళ(శుక్రవారం) ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ సభకు దాదాపు 30 వేలమంది టీచర్లు హాజరయ్యారు. 
 


Telangana

ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.  
 

Telangana

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... ప్రస్తుతం తెలంగాణ భవిష్యత్ ఎల్బి స్టేడియంలో వుందన్నారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఇక్కడున్న వేలాదిమంది ఉపాధ్యాయులపై వుందన్నారు. రాష్ట్రంలోని 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ మీ చేతుల్లో వుంది... మీరే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. 

Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేట్ స్కూల్స్ లోనే ఎక్కువమంది విద్యార్థులు చదువుతున్నారు... ప్రైవేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? అని రేవంత్ అడిగారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చన్నారు. ఈ బడ్జెట్ లో విద్యా వ్యవస్థకు 10శాతం నిధులు  కేటాయించాలని భావించాం... కానీ ఇతర హామీల అమలు దృష్ట్యా 7.3శాతం నిధులు కేటాయించామన్నారు. ఇది కూడా ఏం తక్కువ కాదు.. రూ.21వేల కోట్లకు పైగా నిధులు దక్కాయన్నారు.

Telangana

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది... కానీ స్వరాష్ట్రంలో వారి పరిస్థితి దారుణంగా మారిందని సీఎం అన్నారు. కొత్త రాష్ట్రంలో విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం... కానీ అలా జరగలేదన్నారు. గత పదేళ్లు ఏం జరిగిందో.... పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామన్నారు.

Telangana

అయితే తాము గత పాలకుల్లా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నాం...అందువల్లే అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సమయానికి జీతాలు అందించే ఏర్పాటు చేసామన్నారు. పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించామన్నారు. మిగతా సమస్యలను కూడా పరిష్కరించి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. 

Telangana

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే తాను ఈ స్థాయికి చేరానని సీఎం రేవంత్ అన్నారు. టీచర్లంతా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు మంచి విద్య అందించాలని సూచించారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి.. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడమే ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలని సూచించారు.
 

Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించినట్లు సీఎం తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించామన్నారు.ఇక ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు సీఎం రేవంత్. 

Telangana

ఇక క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుందని...గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల వరకు మినీ స్టేడియంల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు. 

Telangana

ఇక నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది... అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 

Latest Videos

click me!