Telangana Jobs Notification : తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, ఆర్టిసిలో స్పెషలిస్ట్ మెడికల్ ఆపీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, ఈఎన్టి, రేడియాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైక్రియాటిస్ట్, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయో కెమిస్ట్రీ విభాగాల్లో 1616 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి TVVP లో భర్తీచేయనున్న స్పెషలిస్ట్ పోస్టులు. ఇక తెలంగాణ ఆర్టిసిలో అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆప్థల్మాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, పల్మనాలజీ, రేడియాలజీ విభాగాల్లో మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.