ఆ తర్వాత రిపబ్లిక్ డే వేడుకలు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, గవర్నర్ ప్రోటోకాల్ వివాదం, రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన తమిళిసై.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో వేర్వురుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఆ భేటీల తర్వాత తమిళిసై చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ఆమె కామెంట్స్‌పై టీఆర్ఎస్ నాయకులు ఘాటుగానే స్పందించారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని.. ప్రజల చేత ఎన్నుకున్న ప్రతినిధులమని కౌంటర్ ఇచ్చారు. తమిళిసై బీజేపీ మూలాలను కలిగి ఉండటంతో రాజ్‌భవన్‌ను బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మార్చారని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ అగ్రనేతలు ఆరోపించారు.