హైదరాబాద్ కు బంగ్లాదేశీలు..? తెలంగాణ పోలీసులు అలర్ట్..!

First Published | Aug 8, 2024, 2:20 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను బంగ్లాదేశ్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా బంగ్లాదేశీలు నివాసముంటున్నారన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 

Bangladeshis in Hyderabad

Bangladeshis in Hyderabad : బంగ్లాదేశ్ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా వుంది. లా ఆండ్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పింది... పాలన అస్తవ్యస్తంగా మారింది.ఏకంగా ప్రధాని నివాసంపైనే ఆందోళనకారులు దాడి  చేసారంటేనే అక్కడ పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారింది. 
 

Bangladeshis in Hyderabad

రిజర్వేషన్ల వ్యవహారం బంగ్లాదేశ్ కొంప ముంచింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు భయానకంగా వున్నాయి. దీంతో చాలామంది దేశాన్ని విడిచి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇలాంటివారు అక్రమంగా భారత్ లో చొరబడే అవకాశం వుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లా సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు.  
 


Bangladeshis in Hyderabad

తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లోకి బంగ్లాదేశీలు ప్రవేశించకుండా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే చాలామంది బంగ్లాదేశీలు హైదరాబాద్ లో అక్రమంగా నివాసం వుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి సాయంతో మరింతమంది బంగ్లాదేశీలు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం వుండటంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. 

Bangladeshis in Hyderabad

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసారు. బుధవారం కాటేదాన్, పహడీ షరీఫ్, ఫలక్ నుమా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కూడా మీ ప్రాంతంలో కొత్తగా వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Bangladeshis in Hyderabad

ఇప్పటికే హైదరాబాద్ లో రోహింగ్యా భారీగా నివాసం వుంటున్నారనే అనుమానాలున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశీలు కూడా హైదరాబాద్ వస్తే పరిస్ధితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలోనే ఇలాంటివారు ఎక్కువగా ఆశ్రయం పొందుతున్నారని...వెంటనే వీరిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బంగ్లాదేశీల వ్యవహారం కూడా తెలంగాణ రాజకీయాల్లో అలజడి సృష్టించే అవకాశం వుంది. 

Bangladeshis in Hyderabad

ఇప్పటికే కొందరు బంగ్లాదేశీలు భారత్ లోకి ప్రవేశించారని... వారిలో కొందరు హైదరాబాద్ కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం దీన్ని దృవీకరించలేదు. కానీ నగరవ్యాప్తంగా పోలీసుల అలర్ట్ అయ్యారు... అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో బంగ్లాదేశీల ప్రవేశంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 
 

Latest Videos

click me!