పండిన టమాటా బంగారం : నెలలో రూ.1.8 కోట్లు సంపాదించిన తెలంగాణ రైతు..

Published : Jul 22, 2023, 04:15 PM IST

ఓ తెలంగాణ రైతు అద్భుతం సాధించాడు. ఒక్కనెలలో టమాటాలు అమ్మి దాదాపు రెండు కోట్ల రూపాయలు సంపాదించాడు. 

PREV
17
పండిన టమాటా బంగారం : నెలలో రూ.1.8 కోట్లు సంపాదించిన తెలంగాణ రైతు..

హైదరాబాద్ : పెరిగిన టమాటా ధరలు తెలంగాణకు చెందిన టమాటారైతును కోటీశ్వరుడిని చేసింది. ఒక్క నెలలోనే టమాటాల విక్రయంతో రూ. 1.8 కోట్లు సంపాదించాడు అతను. ఆ రైతు బి మహిపాల్ రెడ్డి (40). మెదక్‌ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి చదువు అబ్బలేదు. పదో తరగతి వరకు ఎలాగో కష్టపడి నెట్టుకొచ్చాడు. ఆ తరువాత వ్యవసాయంలోకి దిగాడు.

27

వరి సాగు ఆశించిన దిగుబడులు ఇవ్వలేదు. దీంతో కూరగాయల సాగుకు మారాడు. ప్రస్తుతం టమాటా పంటతో అతనికి జాక్ పాట్ తగిలింది. జూన్ 15 నుండి ఇప్పటి వరకు కేవలం ఒక నెలలో, తాను పండించిన టమాటా పంటతో రూ. 1.8 కోట్లు సంపాదించాడు మహిపాల్ రెడ్డి. 

37

మెదక్‌లోని కౌడిపల్లి గ్రామానికి చెందిన ఈ 40 ఏళ్ల రైతుకు పట్టుదల, మార్కెట్ పరిస్థితిపై అవగాహన గొప్ప ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఆంధ్ర ప్రదేశ్ నుండి సరఫరా ఆగిపోవడం, అధిక ధరలతో హైదరాబాద్ మార్కెట్‌లో టమోటాల డిమాండ్ ను పూరించడంలో అతను కృతకృతుడయ్యాడు. 

47

టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో అతను పండించిన పంట కిలో రూ.100కి పైగా పలికింది. దీని గురించి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘నేను ఏప్రిల్ 15 నుండి ఎనిమిది ఎకరాల్లో ఈ సీజన్‌లో టమోటాలు పండించాను. జూన్ 15 నుండి దిగుబడి మొదలయ్యింది. వాతావరణ సంబంధిత మార్పుల నుండి పంటను రక్షించడానికి వలలను ఉపయోగించాను. దీనవల్ల నా పంట ఉత్పత్తి ఏ గ్రేడ్ గా ఉంది. దిగుబడి గణనీయంగా వచ్చింది. 

57

అధిక వర్షం కారణంగా కొంత పంట నష్టం జరిగినప్పటికీ, ఈ సీజన్‌లో నా మొత్తం ఆదాయం ఈజీగా రూ.2 కోట్లను దాటుతుంది. ఇంకా నా పొలంలో ఇప్పటికీ 40% పంట ఉంది’ అని చెప్పారాయన. మహిపాల్ రెడ్డికి దాదాపు 100 ఎకరాల భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం దాదాపు 40 ఎకరాల్లో కూరగాయలు, టమోటా సాగు చేయడం ప్రారంభించాడు. మిగిలినవి ఇప్పటికీ వరిపంటకు వినియోగిస్తున్నారు. "సరైన పద్ధతులను అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది, మొదటి పంట తర్వాత వెంటనే లాభాలు రావు" అని చెప్పారాయన.

67

టమాటా పంట ఆర్థికాంశాలను వివరిస్తూ, "నేను ఎకరాకు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడతాను. వ్యవసాయంలో మెళకువలు బాగుంటే రైతులు సాధారణ సీజన్‌లో చాలా మంచి రాబడిని పొందగలరని, ఈసారి నాకు చాలా మంచి పంట, అధిక ధరలు అద్భుతమైన రాబడిని ఇచ్చాయని"  చెప్పారు.

77
Tomato rice

తాను సుమారు 7,000 టొమాటో పెట్టెలను విక్రయించానని, ఒక్కోటి 25 కిలోల కంటే ఎక్కువగా ఉన్నాయని రెడ్డి చెప్పారు. అతను ఇప్పుడు తన వరి పొలాలపై ఎరువులు పిచికారీ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించాలనుకుంటున్నాడు, ఖర్చులను తగ్గించడానికి, దిగుబడిని పెంచడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నాడు.

click me!

Recommended Stories