తడిసి ముద్దయిన హైదరాబాద్.. భారీ వర్షంతో జనం అవస్థలు (ఫోటోలు)

First Published | Jul 20, 2023, 9:25 PM IST

గత రెండు  రోజులుగా  కురుస్తున్న వర్షాల కారణంగా  హైద్రాబాద్ నగరంలో గురువారంనాడు  పలు చోట్ల  ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఎండీ భాగ్యనగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

rain

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని .. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్‌ బృందాలను కూడా మోహరించింది. 

rain

వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో వుంటారని జీహెచ్ఎంసీ తెలిపింది. శిథిలావస్థలో వున్న భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. 

Latest Videos


rain

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. 

rain

భద్రాచలం లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు వున్నాయని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

rain

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా వుంచాలని ముఖ్యమంత్రి సూచించారు. 

click me!