'ఈ రేవంతుడు... తెలంగాణ హనుమంతుడు': తెలంగాణ సీఎం స్వరం మారిపోయిందే...

First Published | Apr 23, 2024, 11:12 AM IST

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వరం మారింది.  ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి అన్నట్లుగా బిజెపిని రామభక్తితోనే దెబ్బతీయాలన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. 

cm revanth reddy

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు అసలు పొంతన లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వున్న పరిస్థితులను చాలా భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు వున్నాయి... అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పనిచేస్తే ఇప్పుడు హిందూ సెంటిమెంట్ పనిచేసేలా కనిపిస్తోంది. హిందుత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. దీంతో హిందూ సమాజం మొత్తం వన్ సైడ్ బిజెపి వైపు కాకుండా కాంగ్రెస్ ముందుగానే జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే తెలంగాణ పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి రూటు మార్చారు. ఆయన నోట రామనామ స్మరణ వినిపిస్తుండటమే ఇందుకు నిదర్శనం. 

revanth Reddy

ఇవాళ (మంగళవారం) హనుమాన్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.  

రాముడి విధేయుడు…
రాక్షస వధ వీరుడు…
హనుమంతుడు…

ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట…
ఈ రేవంతుడు…
తెలంగాణ హనుమంతుడు.
ఇప్పటికీ ఎప్పటికి …

అంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు  తెలిపారు రేవంత్. 

Latest Videos


Revanth Reddy

ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా విషెస్ తెలిపారు.  'యుగయుగాలకు తరగని వ్యక్తిత్వం, ఈ జగాన పరిపాలనకు ఆదర్శం, మన శ్రీరామచంద్రమూర్తి జీవితం. జయ జానకీ నాయకుడి కళ్యాణ వైభోగం సందర్భంగా భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు'' అంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేసారు.  

Congress, BJP,

ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ శ్రీరామస్మరణ : 

తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న(సోమవారం) ప్రచారం చేపట్టారు. ఈ మూడిట్లో రెండుచోట్ల బిజెపి సిట్టింగ్ ఎంపీలు, మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ లాంటి సీనియర్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ బిజెపి ప్రభావం ఎక్కువని తెలుసుకున్న రేవంత్ అందుకు తగ్గట్లుగా మాట్లాడుతున్నారు.  
 

Revanth Reddy

బిజెపి హిందూ, ముస్లింల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ పొలిటికల్ బిజినెస్ చేస్తోందని రేవంత్ మండిపడ్డారు. ఓటర్లు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి...'దేవుడు గుడిలో వుండాలి... భక్తి గుండెల్లో వుండాలి... బిజెపి అనుకుంటున్నట్లు పోలింగ్ డబ్బాల్లో కాదు'' అంటూ చురకలు అంటించారు. తాను అచ్చమైన హిందువును... హిందువుగా పుట్టినందుకు గర్విస్తానని రేవంత్ అన్నారు. ఇలా ఎప్పుడూ హిందుత్వం గురించి మాట్లాడని రేవంత్ ఇటీవల చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.  

Reavnth reddy

రేవంత్ స్వరం మార్పు అందుకోసమేనా? 

తెలంగాణలో బిజెపి బలపడుతోంది... ఈ విషయం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. ఒక్క ఎమ్మెల్యే నుండి ఎనిమిది ఎమ్మెల్యేలకు... సింగిల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్ కు బిజెపి ఓటింగ్ శాతం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే బిజెపి పరిస్థితి ఇలా వుంటే లోక్ సభ ఎన్నికల్లో ఇది మరింత మెరుగుపడే అవకాశం వుంటుందిని సర్వేలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో మాదిరిగానే బిజెపి అసెంబ్లీ కంటే లోక్ సభలోనే మెరుగైన ప్రదర్శన చేస్తుందని అంటున్నారు. 
 

revanth reddy

రేవంత్ స్వరం మారడానికి బిజెపి ఎఫెక్ట్ కారణంగా తెలుస్తోంది. బిజెపి హిందుత్వ పాలిటిక్స్, ప్రధాని మోదీ చరిష్మాను తట్టుకుని నిలవాలంటే వారి రూట్ లోనే నడవాలన్నది రేవంత్ ప్లాన్ గా కనిపిస్తోంది. అందువల్లే బిజెపి కంటే తానే గొప్ప హిందుత్వ వాదిని అని నిరూపించుకునేందుకు రామనామ స్మరణ చేస్తున్నారు. మరి రేవంత్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. 

Revanth Reddy, KCR

గతంలోనూ కేసీఆర్ ఇలాగే : 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాగే బిజెపిని కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు. తన కంటే గొప్ప హిందువు ఎవరూ లేరంటూ కామెంట్స్ కూడా చేసారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయన మాటలను పెద్ద సీరియస్ గా తీసుకకోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు సాధించింది. ఆదిలాబాద్ లో సోయం బాపురావు, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలిచారు. ఆసక్తికర విషయం ఏమిటంటే నిజమాబాద్ లో స్వయంగా కేసీఆర్ కూతురు కవితను బిజెపి ఓడించింది. 
 

click me!