కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ... కాంగ్రెస్ కంచుకోట నుండే షురూ..

Published : Apr 22, 2024, 10:34 AM ISTUpdated : Apr 22, 2024, 10:49 AM IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఇలా సాగనుంది...

PREV
120
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ... కాంగ్రెస్ కంచుకోట నుండే షురూ..
KCR

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పొయిన బిఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ లో తీవ్ర నిరుత్సాహం ఆవరించింది... అది లోక్ సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలో తిరిగి నూతనోత్తేజం నింపడానికి అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. 

220
KCR

పోయిన చోటే వెతుక్కోవాలని అంటుంటారు... దీన్ని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాలో అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్నే కాదు తెలంగాణ రాజకీయాలపై పట్టును కూడా కోల్పోయారు కేసీఆర్. ఇలా ఎన్నికల్లో ఓటమే కదా ప్రస్తుత పరిస్థితి కారణం... కాబట్టి లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటి తెలంగాణలో తాను ఎంత బలమైన నాయకుడో తెలియజేయాలని చూస్తున్నారు కేసీఆర్. ఇందుకోసం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. 
 

320
KCR

లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటి బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం అందించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు తానే రంగంలోకి దిగారు. తెలంగాణలో లోక్ సభ పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో మరో రెండురోజుల్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. కేసీఆర్ బస్సుయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఇలా వుంది. 
 

420

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ : 

24.04.2024 (మొదటిరోజు) 

సాయంత్రం 5.30 కి కేసీఆర్ మిర్యాల గూడలో రోడ్ షో చేపడతారు. 

రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో వుంటుంది. రాత్రి  సూర్యాపేటలోనే కేసీఆర్ బస చేయనున్నారు. 
 

520
Bhongir

25.04.2024 (రెండవ రోజు) 

సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో వుంటుంది. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. 

620
Mahaboobnagar

26.04.2024 (3వ రోజు) 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతజిల్లా మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్ షో సాగనుంది. సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ లో కేసీఆర్ ప్రచారం వుంటుంది.  రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 

720
KCR

27.04.2024 (4వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు  నాగర్ కర్నూల్ లో కేసీఆర్ రోడ్ షో వుంటుంది. రాత్రి బస హైదరాబాద్ లో వుంటుంది.

820
warangal

28.04.2024 (ఐదవరోజు) 

సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ వరంగల్ లో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి బస అక్కడే వుంటుంది. 
 

920
khammam

29.04.2024 (6వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రాత్రికి అక్కడే ఆయన బస వుంటుంది. 
 

1020
kcr

30.04.2024 (7వ రోజు) 

సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ తల్లాడలో రోడ్ షో నిర్వహిస్తారు. 6.30కి ఈ రోడ్ షో కొత్తగూడెం లో సాగుతుంది. రాత్రి కొత్తగూడెంలొనే కేసీఆర్ బస చేస్తారు. 

1120
mahabubabad

01.05.2024 (8వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ లో కేసీఆర్ రోడ్ షో... రాత్రి బస వరంగల్ లో వుంటుంది. 
 

1220
KCR

02.05.2024 (9వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో... రాత్రి వీణవంకలో బస చేస్తారు. 

1320
KCR

03.05.2024 (10వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు  రామగుండంలో కేసీఆర్ రోడ్ షో... రాత్రికి అక్కడే బస చేస్తారు. 
 

1420
KCR

04.05.2024 (11వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు మంచిర్యాలలో రోడ్ షో... రాత్రికి కరీంనగర్ లోనే బస చేస్తారు. 
 

1520
kcr

05.05.2024 (12వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు జగిత్యాలలో రోడ్ షో... రాత్రికి జగిత్యాలలోనే కేసీఆర్ బస చేయనున్నారు. 
 

1620
nizamabad

06.05.2‌‌024 (13వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ లో రోడ్ షో... రాత్రికి అక్కడే బస చేయనున్నారు కేసీఆర్. 
 

1720
kamareddy

07.05.2024 (14వ రోజు) 

సాయంత్రం 5.30కి కామారెడ్డిలో రోడ్ షో 
రాత్రి 7 గంటలకు మెదక్ లో రోడ్ షో 
రాత్రి కేసీఆర్ బస మెదక్ లోనే 
 

1820
KCR

08.05.2024 (15వ రోజు) 

సాయంత్రం 5.30కి నర్సాపూర్ లో రోడ్ షో 

రాత్రి 7 గంటలకు పటాన్ చెరులో రోడ్ షో 

రాత్రి బస ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 
 

1920
karimnagar

09.05.2024 (16వ రోజు) 

సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ లో రోడ్ షో 

రాత్రి కరీంనగర్ లోనే కేసీఆర్ బస వుంటుంది. 
 

2020
kcr

10.05.2024 (17వ రోజు) 

సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో 

సాయంత్రం 6.30 గంటలకు సిద్దిపేటలో రోడ్ షో 

రాత్రి హైదరాబాద్ లో బస 
 

Read more Photos on
click me!

Recommended Stories