దేశమంతా ఎన్నికల హాడావిడి మొదలయ్యింది.. తెలంగాణలో కూడా ఆగాలి గట్టిగా వీస్తుంది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నడుస్తోంది. అన్నిపార్టీల నుంచి నేతలంతా ప్రచారంలో దిగిపోయారు. అయితే ఇలాంటి కీలకసమయంలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ సినీ నటి.. స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి మాత్రం సైలెంట్ అయిపోయారు. ఆమె అసలు ఎక్కడా కనిపించకపోవడం అందరిని ఆచ్చర్యపరుస్తోంది.
ఏ పార్టీలో ఉన్నా.. పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టీవ్ గా ఉండే విజయశాంతి.. తాను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా.. పెద్దగా యాక్టీవ్ అనిపించడం లేదు. ఈ సంయంలో ఆమె ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అన్న ప్రశ్నలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్ ఆమెను దూరంగా ఉంచిందా..? లుక ఇక్కడ ఉన్న నేతలు ఆమెను పట్టించుకోవడం లేదా..? లేక కాంగ్రెస్ పార్టీనే విజయశాంతి దూరం పెట్టిందా? అనేది తెలియడం లేదు.
మొన్నటి ఎన్నికల ముందు వరకూ బీజేపీతో ఉన్నారు విజయశాంతి. కాని అందులో యాక్టీవ్ గా ఉండలేకపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కొంత కాల ముందే ఆమె కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులు గాంధీభవన్‌లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమంలో ఆమె కనిపించలేదు. కాంగ్రెస్ నుంచి మాయం అయ్యారు.
అంత పెద్ద నాయకురాలి మాట కూడా కాంగ్రెస్ లో వినిపించడం లేదు. ఎప్పుడూ ఎంపీగానే పోటీ చేస్తూ వస్తోన్న విజయశాంతి... ఇంత కీలకమైన లోక్ సభ ఎలక్షన్స్ జరుగుతుంటే.. కనిపించకపోవడంతో.. అందరిలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఈవిషయం పక్కన పెడితే మీడియా కూడా విజయశాంతిని పట్టించుకోవడం లేదు. అంతే కాదు విజయశాంతి పార్టీలో చేరి ఇంత కాలం అవుతున్నా.. కాంగ్రెస్ కూడా ఆమెకు ఎటుంటి బాధ్యత అప్పగించకపోవడం చిత్రంగా అనిపిస్తోంది.
Vijayashanti road show at Peddaplli
ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనకు మెదక్ లోక్‌సభ టికెట్ కావాలనే షరత్ విధించారట విజయశాంతి. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు ఎంత సీనియర్లు అయినా కంపల్సరీగా అప్లికేషన్ పెట్టుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన మీదటే అభ్యర్థులను ఎంపిక చేస్తుంది అధిష్టానం. విజయశాంతి ఎలాంటి అప్లికేషన్‌ను పెట్టుకోలేదట. అందుకే ఆమె పేరును పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు.
గతంలో చాలా సార్లు చాలా పార్టీల మీద అలిగిన విజయశాంతి తన ఇమేజ్ ను పార్టీ గుర్తించకపోవడంతో అలిగారని తెలుస్తోంది... తల్లీ తెలంగాణ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో మారుతూ వస్తున్నారు. ఏపార్టీలో కూడా ఆమె నిలబడలేకపోయారు. చివరకు కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ముందు ముందు ఏం చేయబోతున్నారో చూడాలి. కొంత మంది మాత్రం ఆమె రాజకీయాలు వదిలి సినిమాల్లో యాక్టీవ్ అవుతారంటూ కామెంట్లు చేస్తున్నారు.