తిరుమలలో కేసీఆర్ కుటుంబం... శ్రీవారికి మొక్కు తీర్చుకున్న సీఎం సతీమణి

Published : Oct 10, 2023, 02:57 PM IST

తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. 

PREV
14
తిరుమలలో కేసీఆర్ కుటుంబం... శ్రీవారికి మొక్కు తీర్చుకున్న సీఎం సతీమణి
KCR Wife Shoba

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాలను ఆమె సందర్శించారు. ఇందుకోసం సోమవారమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. 

24
KCR Wife Shoba

కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అర్చన సేవలో పాల్గొన్నారు కల్వకుంట్ల శోభ. అనంతరం తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. టిటిడి అర్చకులు కేసీఆర్ సతీమణికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసారు. 
 

34
KCR Wife

వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి కేసీఆర్ కుటుంబసభ్యులకు దర్శన ఏర్పాట్లు చేసారు. తిరుమలకు చేరుకున్న దగ్గరినుండి తిరిగి వెళ్లిపోయేవరకు కేసీఆర్ కుటుంబసభ్యులకు ఏలోటూ రాకుండా ఏర్పాట్లు చేసారు.
 

44
KCR Wife

ఇక శ్రీవారి దర్శనం అనంతరం శోభ శ్రీకాళహస్తి వెళ్లారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు చిత్రపటాన్ని బహూకరించారు. 


 

click me!

Recommended Stories