మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
బీఆర్ఎస్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ క్యాడర్ లో నిరుత్సాహన్ని నింపాయి. నిజామాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ దూకుడుగా కసరత్తు చేస్తుంది. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ చేసింది.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
ఈ నెల 1వ తేదీన మహాబూబ్‌నగర్ లో పాలమూరు గర్జన సభ, ఈ నెల 3న ఇందూరు గర్జన సభను బీజేపీ నిర్వహించింది. ఈ రెండు సభల్లో తెలంగాణలో వేల కోట్ల రూపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.ఈ నెల 1న పాలమూరులో రూ. 13,545 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను మోడీ ప్రారంభించారు.ఈ నెల 3న రూ.8,012 కోట్ల విలువైన పనులను మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
ఈ నెల 3న నిజామాబాద్ లో జరిగిన బీజేపీ సభలో బీఆర్ఎస్ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్‌డీఏలో చేరుతానని కేసీఆర్ తనకు చెప్పారని మోడీ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేటీఆర్ ను సీఎం చేసేందుకు మీ ఆశీర్వాదాలు కావాలని కూడ తనకు చెప్పారని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. తన స్థాయిని మరిచి మోడీ అబద్దాలు ఆడారని బీఆర్ఎస్ కౌంటరిచ్చింది. ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
నిజామాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేశాయి. బీజేపీ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహలు చేసుకుంటుంది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేతలకు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది ఆ పార్టీ జాతీయ నాయకత్వం. నిన్న బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు.ఇవాళ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తమ తమ వాదనలను రెండు పార్టీలు సమర్ధించుకుంటున్నాయి. రాజకీయంగా ఒకరిపై మరొక పార్టీ పైచేయి సాధించే ప్రయత్నాలను ప్రారంభించాయి.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
ఇదే సమయంలో ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు కాంగ్రెస్ కూడ ప్రయత్నాలను ప్రారంభించింది. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య బంధం ఉందని తాము చెబుతున్న విషయం ప్రధాని మోడీ వ్యాఖ్యలతో తేలిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ పై తాను ఈడీ, ఐటీ సంస్థలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ తో స్నేహం చేస్తున్న ఎంఐఎం కూడ తమ పార్టీ వైఖరిని చెప్పాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
ఇదిలా ఉంటే ఈ నెల మొదటి వారంలో ప్రధాన మంత్రి రెండు పర్యటనలతో బీజేపీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఈ నెల 10న అమిత్ షా ఆదిలాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ బీఎల్ సంతోష్ నిన్న హైద్రాబాద్ కు చేరుకున్నారు. బీజేపీ మరో కీలక నేత సునీల్ భన్సల్ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలపై కేంద్రీకరించారు. ఇవాళ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు.
మోడీ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో బీఆర్ఎస్: బీజేపీలో ఉత్సాహం
మరోవైపు ఈ నెలలోనే వరంగల్ వేదికగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ను నిర్వహించనుంది.ఈ సభలో మేనిఫెస్టోను ఆ పార్టీ ప్రకటించనుంది. మేనిఫెస్టోలో ఓటర్లకు పలు వరాలను కురిపించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.