ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజ్ భవన్ లో తమిళిసైతో కేసిఆర్ (ఫోటోలు)
First Published | Jun 28, 2022, 11:45 AM ISTహైదరాబాద్ : చాలాకాలం తర్వాత తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఒకే వేదికపైకి వచ్చారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. గవర్నర్ తమిళిసై బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు కూడా సీఎం హాజరుకావడం లేదు. అంతేకాదు బహిరంగంగానే గవర్నర్ వ్యవహార శైలిపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇలా గవర్నర్ కు, టీఆర్ఎస్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో హైకోర్ట్ సీజె ప్రమాణస్వీకారం కోసం ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది.