2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతుల చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయలేదు. హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలను రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు.
కాగా తాజాగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది. 6 స్థానాలకు అవకాశం ఉన్నా ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి పదవుల రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.