Telangana Rains
మరో రెండ్రోజులు ఈ తెలంగాణ జిల్లాలకు వర్షసూచన :
తెలంగాణలో శుక్రవారం మొదలైన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వేసవి కాలంలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇవాళ, రేపు (మార్చి 22, మార్చి 23న) 40-50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిస్తాయని హెచ్చరించారు. ఇలా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటల 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని హెచ్చించారు. రాజధాని హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక మార్చి 24 సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలనల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది.