ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

First Published | Oct 29, 2023, 12:10 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్  మెజారిటీ సీట్లు దక్కించుకొనేందుకు వ్యూహం రచిస్తుంది.  
 

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ఈ ఎన్నిల్లో  మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్  ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది.  కానీ  ఇతర పార్టీల నుండి  విజయం సాధించిన ప్రజా ప్రతినిధులు  బీఆర్ఎస్ లో చేరారు.  ఈ దఫా మాత్రం  ఇతర పార్టీల కంటే  మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని బీఆర్ఎస్  పావులు కదుపుతుంది

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

ఈ మేరకు  జిల్లాలోని  పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు  పార్టీ కీలక నేతలకు  బాధ్యతలను అప్పగించింది బీఆర్ఎస్ నాయకత్వం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన  ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  కాంగ్రెస్ లో పార్టీలో చేరారు.


ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్


2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత  టీడీపీ నుండి  తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో  చేరారు.  2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఎంపీగా ఖమ్మం నుండి విజయం సాధించిన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.  

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

రెండు మాసాల క్రితం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత మాసంలో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి  జలగం వెంకటరావు  మాత్రమే విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్ధిగా  విజయం సాధించారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో  ఈ దఫా  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ  వ్యూహ రచన చేస్తుంది.  గత రెండు ఎన్నికల్లో  ఇతర పార్టీల నుండి విజయం సాధించిన ప్రజా ప్రతినిధులను  బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
 

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  2014 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన  పువ్వాడ అజయ్ కుమార్ , అప్పట్లో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పువ్వాడ అజయ్ కుమార్  ఖమ్మం నుండి పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. మరోసారి ఖమ్మం నుండి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగుతున్నారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  2014 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. అనారోగ్యంతో  రాంరెడ్డి  వెంకట్ రెడ్డి  మృతి చెందడంతో  పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో  రాంరెడ్డి వెంకట్ రెడ్డి  సతీమణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా  తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.2018 ఎన్నికల్లో పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  కందాల ఉపేందర్ రెడ్డి  పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత  మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. 

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేయాలని భావించారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం  తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు కేటాయించలేదు. పాలేరు నుండి  మరోసారి కందాల ఉపేందర్ రెడ్డికే  బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది.దీంతో  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రాములు నాయక్  టీఆర్ఎస్ అభ్యర్ధి మదన్ లాల్ పై విజయం సాధించారు.2014 ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా  బరిలోని దిగిన బానోతు మదన్ లాల్ విజయం సాధించారు.   ఎన్నికల తర్వాత  మదన్ లాల్  వైసీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

2014 , 2018 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు.  2014లో  సీపీఎం అభ్యర్ధి కమల్ రాజుపై భట్టి విక్రమార్క విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో  కమల్ రాజు బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగారు. మరోసారి కమల్ రాజుపై భట్టి విక్రమార్క గెలుపొందు. ఈ ఎన్నికల్లో కూడ భట్టి విక్రమార్క మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

2014, 2018 ఎన్నికల్లో  సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుండి సండ్ర వెంకటవీరయ్య విజయం సాధించారు.ఈ రెండు ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్య టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మట్టా దయానంద్ విజయ్ కుమార్ పై  సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిపై సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. ఎన్నికల తర్వాత పరిణామాల్లో  సండ్ర వెంకట వీరయ్య టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

ఇల్లెందు అసెంబ్లీ స్థానం నుండి  2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా  కోరం కనకయ్య  విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి హరిప్రయ నాయక్ పై  ఆయన గెలుపొందారు. 2018 ఎన్నికల్లో   బీఆర్ఎస్ అభ్యర్ధిగా  కోరం కనయ్య బరిలో దిగారు.కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన హరిప్రియ నాయక్ చేతిలో కోరం కనయ్య ఓటమి పాలయ్యారు.ఆ తర్వాతి రాజకీయ పరిణామాల్లో  హరిప్రియ నాయక్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో  హరిప్రియా నాయక్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

2014 అసెంబ్లీ స్థానం నుండి  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి రేగా కాంతారావు,  బీఆర్ఎస్ అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లుపై  గెలుపొందారు.  ఆ తర్వాతి పరిణామాల్లో  రేగా కాంతారావు  కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో చేరారు.

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

2014 ఎన్నికల్లో ఆశ్వరావుపేట అసెంబ్లీ స్థానం నుండి  వైసీపీ అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు.  టీడీపీ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావుపై ఆయన గెలుపొందారు.2018 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు  బీఆర్ఎస్ అభ్యర్థి   తాటి వెంకటేశ్వర్లుపై గెలుపొందారు. మెచ్చా నాగేశ్వరరావు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.  మరోసారి ఆయన బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగుతున్నారు. 

ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్


2014 ఎన్నికల్లో  కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన జలగం వెంకటరావు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా జలగం వెంకటరావు  మరోసారి బరిలోకి దిగారు.  అయితే  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరావు విజయం సాధించారు. ఆ తర్వాతి పరిణామాల్లో వనమా వెంకటేశ్వరరావు  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.  మరోసారి ఆయన బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  అభ్యర్ధులు ఓటమికి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమని  అప్పట్లో  ఆ పార్టీకి చెందిన నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.  అయితే  ఇందులో వాస్తవం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పట్లోనే కొట్టిపారేశారు.

Latest Videos

click me!