పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

First Published | Aug 31, 2023, 5:25 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంపై  ముగ్గురు నేతలు  దృష్టి పెట్టారు. అయితే  ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయం ఇంకా తేలలేదు.

పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంపైనే  ముగ్గురు ప్రధాన నేతలు  దృష్టి పెట్టారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం సాగుతుంది.ఈ  విషయమై ఇవాళ  సోనియా  గాంధీతో   సమావేశమయ్యారు. వైఎస్ఆర్‌టీపీ  కాంగ్రెస్ లో  విలీనం చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకుందనే ప్రచారం సాగుతుంది.  వైఎస్ షర్మిల  తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే   ఆ పార్టీ  షర్మిలను ఎలా ఉపయోగించుకుంటుందోననే చర్చ ప్రస్తుతం  సర్వత్రా సాగుతుంది.  

పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

తెలంగాణకు చెందిన  కొందరు  నేతలు  షర్మిలను తెలంగాణకు పరిమితం చేయవద్దని కోరుతున్నారు. తెలంగాణలో  షర్మిల ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు నష్టమని   తెలంగాణకు చెందిన నేతలు  కొందరు  భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కే షర్మిలను  పరిమితం చేయాలని కోరుతున్నారు.ఈ విషయమై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తన అభిప్రాయాన్ని మీడియా వేదికగా  కూడ  తేల్చి చెప్పారు. 


పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

ఇదిలా ఉంటే  షర్మిల  పాలేరు నుండి పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.ఇప్పటికే  పాలేరులో ఆమె పార్టీ కార్యాలయాన్ని కూడ  ఏర్పాటు చేశారు.

పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

 పాలేరు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో  బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరితే  పాలేరు నుండి  పోటీ చేయాలని భావిస్తున్నారు.  వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో  విలీనం చేసి తెలంగాణకే షర్మిల పరిమితమైతే  పాలేరు నుండి ఆమె పోటీ చేసేందుకు  కాంగ్రెస్ అవకాశం కల్పించనుంది

పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

అదే జరిగితే  తుమ్మల నాగేశ్వరరావు  పాలేరును వదిలి ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసే అవకాశం ఉంది. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసి  తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2014లో  ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

ఇక  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాలేరు, కొత్తగూడెం,  ఖమ్మం అసెంబ్లీ స్థానాలలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీకి  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు.ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో టిక్కెట్ల కోసం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ధరఖాస్తు చేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి  పోటీకి ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు.

పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా  రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలున్నాయి.  మూడు మాత్రమే జనరల్ స్థానాలున్నాయి. పాలేరు అసెంబ్లీ స్థానంపై  ఈ ముగ్గురు కీలక నేతలు  దృష్టి పెట్టారు. కాంగ్రెస్ లో చేరికలు,  విలీనాలు పూర్తైన తర్వాత  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  పాలేరు అసెంబ్లీ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తుందో  భవిష్యత్తులో తేలనుంది.

Latest Videos

click me!