ఎమ్మెల్సీ ఎన్నికలు: నాడు వ్యతిరేకించారు, నేడు ఆ పార్టే కోదండరామ్‌కి మద్దతు

First Published Mar 9, 2021, 4:14 PM IST

తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓ స్థానంలో టీడీపీ తీసుకొన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా  ఆసక్తినెలకొంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ ‌కి టీడీపీ మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన పార్టీ మద్దతే కోదండరామ్ కు దక్కింది. చివరకు ఊరించిన కాంగ్రెస్ పార్టీ స్వంతంగా అభ్యర్ధిని బరిలోకి దింపింది.
undefined
తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీగా టీఆర్ఎస్‌ తో పాటు తెలంగాణవాదులు చేసిన ప్రయత్నంతో టీడీపీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. టీజేఎసీ కూడ టీడీపీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడింది. తెలంగాణ ఉద్యమం సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
undefined
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ వలసలు ఆ పార్టీని మరింత దెబ్బతీశాయి. ఏపీ పైనే చంద్రబాబు ఎక్కువగా కేంద్రీకరించడంతో తెలంగాణపై సరిగా కేంద్రీకరించకపోవడం ఇతరత్రా కారణాలతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో చేరారు. ఒకరిద్దరూ నేతలు మినహా ఇతరులంతా తమ రాజకీయ భవితవ్యం కోసం ఇతర పార్టీలను వెతుక్కొన్నారు.
undefined
ప్రస్తుతం తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ తో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేస్తున్నారు.
undefined
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోదండరామ్ కోరారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ మాత్రం స్వంతంగా పోటీ చేయాలని సిఫారసు చేసింది. దీంతో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన రాములునాయక్ ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.
undefined
లెఫ్ట్ పార్టీలు మద్దతిస్తాయని భావించినప్పటికీ ఆ పార్టీలు కూడ జయసారధిరెడ్డిని బరిలోకి దింపాయి. దీంతో కోదండరామ్ ఒంటరిగా బరిలోకి దిగాడు. అయితే కోదండరామ్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది.2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. ఆ జిల్లాలో మహాకూటమి అభ్యర్ధులకు మంచి ఫలితాలు దక్కాయి.
undefined
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కు మద్దతుగా టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్. రమణ పోటీ చేస్తున్నారు.
undefined
ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టు ఈ ఎన్నికల్లో తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని టీజేఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో తాము వ్యతిరేకించిన టీడీపీ మద్దతు పొందాల్సిన పరిస్థితి కోదండరామ్ కు నెలకొంది.
undefined
click me!